News November 20, 2024

చివరి మ్యాచ్ ఆడేసిన రఫెల్ నాదల్

image

స్పానిష్ ప్లేయర్ రఫెల్ నాదల్ టెన్నిస్ కెరీర్‌కు తెరపడింది. డేవిస్ కప్ తర్వాత తాను రిటైర్ కానున్నట్లు ఆయన గతంలోనే ప్రకటించారు. తాజాగా జరిగిన డేవిస్ కప్ QFలో స్పెయిన్ ఓడిపోవడంతో ఆటగాడిగా ఆయన ప్రయాణం ముగిసింది. చివరగా నెదర్లాండ్స్ ప్లేయర్ జాండ్‌షల్ప్‌తో జరిగిన సింగిల్స్ మ్యాచులో 4-6, 4-6 తేడాతో ఆయన ఓడారు. మ్యాచ్ అనంతరం ఎమోషనల్ అయ్యారు. నాదల్ తన కెరీర్‌లో మొత్తం 22 గ్రాండ్ స్లామ్ టైటిళ్లు గెలిచారు.

Similar News

News October 16, 2025

స్థిరంగా బంగారం ధరలు!

image

భారీగా పెరుగుతున్న బంగారం ధరలకు ఇవాళ బ్రేక్ పడింది. మార్కెట్లకు సెలవు లేకపోయినా ధన త్రయోదశి ముందు బంగారం ధరలు స్థిరంగా ఉండటం గమనార్హం. HYD బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,29,440 పలుకుతుండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,18,650గా ఉంది. అటు వెండి ధర రూ.1,000 తగ్గింది. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.2,06,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News October 16, 2025

474 ఇంజినీరింగ్ పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

UPSC 474 ఇంజినీరింగ్ సర్వీసెస్ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి డిప్లొమా/ఇంజినీరింగ్ (సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్), MSc చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. దరఖాస్తు ఫీజు రూ.200, మహిళలు, SC,ST, PwBDలకు మినహాయింపు ఉంది. వెబ్‌సైట్: https://upsconline.nic.in/

News October 16, 2025

వంటింటి చిట్కాలు

image

* పసుపు, కారం, కరివేపాకు పొడిలాంటివి నిల్వ చేసేటప్పుడు చిటికెడు ఇంగువ కలిపితే ఏడాదిపాటు నిల్వ ఉంటాయి.
* బ్రెడ్ ప్యాకెట్లో బంగాళాదుంప ముక్కలు ఉంచితే ఆ బ్రెడ్ తొందరగా పాడవదు.
* యాలకులు ఫైన్ పౌడర్‌లా రావాలంటే కొద్దిగా షుగర్ వేసి గ్రైండ్ చేసుకోవాలి.
* పూరీలు తెల్లగా ఉండాలంటే నూనెలో రెండు జామాకులు వేసి వేయించాలి.
* పకోడీ, జంతికలు చేసేటప్పుడు పిండిలో కొద్దిగా పాలు పోసి కలిపితే కరకరలాడతాయి.