News November 12, 2024
AP డిప్యూటీ స్పీకర్గా రఘురామకృష్ణరాజు

AP అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా TDP ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు పేరు ఖరారైంది. పలువురు నేతల పేర్లను పరిశీలించిన అనంతరం చివరకు RRR వైపే సీఎం చంద్రబాబు మొగ్గుచూపారు. మరెవరూ నామినేషన్ దాఖలు చేయకపోతే కూటమి MLAలు ఆయన్ను ఉపసభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నారు. తాజా ఎన్నికల్లో ఉండి నియోజకవర్గం నుంచి RRR MLAగా గెలిచారు.
Similar News
News September 16, 2025
మద్యంమత్తులో లారీ డ్రైవర్ బీభత్సం

MPలోని ఇండోర్లో ఓ లారీ డ్రైవర్ మద్యం తాగి వాహనంతో బీభత్సం సృష్టించాడు. వాహనాలనే కాకుండా రోడ్డు పక్కనే నడుస్తున్న ప్రజలను కూడా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా పలువురికి గాయాలయ్యాయి. బైకులను ఢీకొట్టి వాటిని రోడ్డు మీద ఈడ్చుకుంటూ తీసుకెళ్లాడు. ఓ బైకును లాక్కెళ్లడంతో దాని ట్యాంక్ పేలి లారీ మొత్తం తగలబడిపోయింది. డ్రైవర్ ఫుల్గా తాగేసి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదైంది.
News September 16, 2025
ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ గడువు మరో రోజు పొడిగింపు

AY 2025-26కు గానూ ITR ఫైలింగ్ గడువును ఆదాయ పన్ను శాఖ మరోసారి పెంచింది. జులై 31నే ఈ గడువు ముగియాల్సింది. దానిని SEP 15కు పొడిగించింది. ఇప్పుడు మరొక్క రోజు(సెప్టెంబర్ 16 వరకు) పెంచింది. ట్యాక్స్ ఫైలింగ్ పోర్టల్లో టెక్నికల్ గ్లిట్చ్ కారణంగా ఫైలింగ్కు చాలామంది ఇబ్బందులు పడినట్లు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలోనే గడువును పొడిగించినట్లు తెలస్తోంది. గడువులోగా ఫైలింగ్ పూర్తి చేయాలని అధికారులు సూచించారు.
News September 16, 2025
ట్రంప్ హింట్.. అమెరికా చేతికి TikTok!

సెప్టెంబర్ 17కల్లా టిక్ టాక్ పగ్గాలు అమెరికా చేతికి రాకపోతే ఆ యాప్ను తమ దేశంలో బ్యాన్ చేస్తామని US ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై చైనా-అమెరికా ఓ ఒప్పందానికి వచ్చినట్లు తెలుస్తోంది. ‘దేశంలోని యువత ఎంతగానో కోరుకుంటున్న ఓ డీల్ దాదాపుగా పూర్తైంది’ అని అధ్యక్షుడు ట్రంప్ పోస్ట్ చేశారు. త్వరలో చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో మాట్లాడనున్నారు. డీల్ కోసం ఫ్రేమ్ వర్క్ కూడా సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.