News November 26, 2024
రఘురామకృష్ణరాజు కేసు.. విజయ్‌పాల్ అరెస్ట్

AP: మాజీ MP, ప్రస్తుత Dy స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ కేసుకు సంబంధించి సీఐడీ మాజీ ఏఎస్పీ విజయ్ పాల్‌ను ఒంగోలు పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయనను గుంటూరుకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇవాళ ఉదయం నుంచి పాల్‌ను సుదీర్ఘంగా విచారించారు. ఆ తర్వాత అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా రఘురామను చిత్రహింసలు పెట్టిన కేసులో విజయ్ పాల్ కీలకంగా వ్యవహరించినట్లు సమాచారం.
Similar News
News December 27, 2025
గ్రామ, వార్డు సచివాలయాల ప్రక్షాళన!

AP: ఎక్కడికి వెళ్తారో.. ఎప్పుడు వస్తారో తెలియదు. ఇదీ గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది తీరు. ఇటీవల కలెక్టర్ల భేటీలో CM దీనిపై సీరియస్ అవడంతో అధికారులు ప్రక్షాళన చేపట్టారు. ఇతర శాఖలకు డిప్యుటేషన్లను రద్దు చేశారు. ఇకపై సిబ్బంది రోజూ ఆఫీసుకు హాజరవ్వాలి. ఏ పని అయినా పై అధికారి ముందస్తు అనుమతితో బయటకు వెళ్లాలి. అక్కడి నుంచే యాప్‌లో హాజరు వేయాలి. పర్యవేక్షణకు వివిధ స్థాయుల అధికారుల్ని నియమిస్తున్నారు.
News December 27, 2025
TGTET హాల్ టికెట్లు విడుదల

TGTET హాల్ టికెట్లు విడుదల అయ్యాయి. TETకు అప్లై చేసుకున్నవారు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ జనవరి 3 నుంచి 31 వరకు నిర్వహించనున్నారు. రోజుకు రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం 9గంటల నుంచి 11.30గంటలకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2గంటల నుంచి సా.4.30గంటల వరకు రెండో సెషన్ ఉంటుంది. వెబ్సైట్: https://tgtet.aptonline.in/
News December 27, 2025
VHT: రోహిత్, కోహ్లీల శాలరీ ఎంతంటే?

విజయ్ హజారే ట్రోఫీలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆడుతుండటంతో వారికి ఎంత శాలరీ వస్తుందన్న చర్చ జరుగుతోంది. లిస్ట్-A మ్యాచ్‌లు 40కు మించి ఆడిన సీనియర్ కేటగిరీ క్రికెటర్లకు ఒక్కో మ్యాచ్‌కు రూ.60K ఇస్తారు. రిజర్వ్‌లో ఉంటే రూ.30K చెల్లిస్తారు. కోహ్లీ, రోహిత్ సీనియర్ కేటగిరీ ప్లేయర్లే కాబట్టి రూ.60K చెల్లిస్తారు. IPLతో పోలిస్తే చాలా తక్కువే అయినా దేశవాళీ క్రికెట్లో ఇది మంచి ఫీజు అనే చెప్పుకోవచ్చు.


