News April 5, 2024
టీడీపీలో చేరనున్న రఘురామకృష్ణరాజు

AP: నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఇవాళ టీడీపీలో చేరనున్నారు. కాసేపట్లో ఆ పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో పార్టీ కండువా కప్పుకోనున్నారు. టీడీపీలో చేరిన తర్వాత ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దానిపై స్పష్టత వచ్చే అవకాశముంది.
Similar News
News April 22, 2025
చెలరేగిన DC బౌలర్లు.. LSG మోస్తరు స్కోర్

లక్నో వేదికగా ఢిల్లీతో జరుగుతున్న మ్యాచులో LSG ఓ మోస్తరు స్కోరు నమోదు చేసింది. ఆ జట్టు ఓవర్లన్నీ ఆడి 159/6కే పరిమితమైంది. ఆ జట్టు ఓపెనర్లు మార్క్‌రమ్ (52), మార్ష్ (45) శుభారంభం అందించినా తర్వాతి బ్యాటర్లు దానిని సద్వినియోగం చేసుకోలేకపోయారు. చివర్లో బదోనీ (36) ఫరవాలేదనిపించారు. ఢిల్లీ బౌలర్లలో ముకేశ్ 4, స్టార్క్, చమీర చెరో వికెట్ తీశారు. ఢిల్లీ టార్గెట్ 160 పరుగులు.
News April 22, 2025
టీడీపీ నేత వీరయ్య చౌదరి దారుణ హత్య

AP: ఒంగోలులో దారుణం జరిగింది. టీడీపీ అధికార ప్రతినిధి, నాగులుప్పలపాడు మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరిని దుండగులు కత్తులతో దాడి చేసి హత్య చేశారు. ఆయన ఇవాళ ఒంగోలు పద్మ టవర్స్‌లోని ఆఫీసులో ఉండగా, ముగ్గురు వ్యక్తులు ముసుగులతో ప్రవేశించి ఘాతుకానికి పాల్పడ్డారు. దుండగులను బిహార్ గ్యాంగ్‌గా అనుమానిస్తున్నారు. వీరయ్య చౌదరి మృతదేహాన్ని ఒంగోలు రిమ్స్‌కు తరలించిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News April 22, 2025
ఉగ్రదాడి కారకులను వదలం: కిషన్ రెడ్డి

TG: జమ్మూ కశ్మీర్ ఉగ్రదాడి కారకులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలే ప్రసక్తే లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. వారు ఎక్కడున్నా వెతికి పట్టుకుంటామని ట్వీట్ చేశారు. ‘అమాయకులపై దాడి ఉగ్రవాదుల పిరికిపంద చర్య. టెర్రరిస్టులకు వ్యతిరేకంగా దేశం మొత్తం ఏకతాటిపైకి వస్తుంది. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది. నేరస్థులపై అత్యంత కఠిన చర్యలు తీసుకుంటాం’ అని ఆయన పేర్కొన్నారు.