News April 6, 2024

రఘురామకృష్ణరాజుకు ఉండి టికెట్

image

AP: రఘురామకృష్ణరాజుకు చంద్రబాబు టికెట్ ఖరారు చేశారు. ఉండి నుంచి RRR ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని ప్రకటించారు. నిన్న రఘురామ టీడీపీలో చేరారు. కాగా, కొద్ది రోజుల క్రితం టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన రామరాజుకు ఉండి టికెట్ కేటాయించారు. తాజాగా ఆయన స్థానంలో RRR పోటీ చేయనున్నారు. దీంతో రామరాజు అనుచరులు ఆందోళనకు దిగారు.

Similar News

News October 27, 2025

భారీ వానలు.. మినుమును ఇలా రక్షించుకోండి

image

నంద్యాల, బాపట్ల, YSR, NTR, తూ.గో, కృష్ణా జిల్లాల్లో మినుము పంట విత్తు నుంచి కోత దశలో ఉంది. భారీ వర్షాలకు నీరు నిలిచి పంట కుళ్లిపోయే ప్రమాదం ఉంది. ఈ సమస్య నివారణకు ముందుగా పొలంలోని నీటిని తొలగించాలి. ఇనుముధాతు లోప సవరణకు ఫెర్రస్ సల్ఫేట్ 5గ్రా. సిట్రిక్ యాసిడ్ 0.5గ్రా. 20 గ్రాముల యూరియా లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. వారం తర్వాత 19:19:19 లేదా పొటాషియం నైట్రేట్ 1% పైరుపై పిచికారీ చేయాలి.

News October 27, 2025

భారీ వానలు.. మినుములో తెగుళ్ల నివారణ

image

భారీ వర్షాలకు మినుము పంటకు పలు తెగుళ్లు ఆశించే అవకాశం ఉంది. వేరుకుళ్లు, కోరినోస్పోరా ఆకు మచ్చ తెగులు నివారణకు హెక్సాకొనజోల్ 5SC 2 మి.లీ లేదా ప్రొపికొనజోల్ 25EC 1మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పూత దశలో మారుకా కాయ తొలుచు పురుగు నివారణకు వర్షాలు తగ్గిన వారం రోజులకు క్లోరిఫైరిఫాస్ 25EC 2.5 మి.లీ లేదా నోవాల్యూరాన్ 45 SC 1మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

News October 27, 2025

మహిళా క్రికెటర్లపై దాడి.. మంత్రి వ్యాఖ్యలతో దుమారం

image

AUS మహిళా క్రికెటర్లను ఓ వ్యక్తి <<18103257>>అసభ్యంగా<<>> తాకిన ఘటనపై MPకి చెందిన మంత్రి విజయ్‌వర్గీయా కామెంట్స్ దుమారం రేపాయి. ‘ఈ ఘటన ప్లేయర్లకు గుణపాఠం లాంటిది. ENGలో ఓ ఫేమస్ ఫుట్‌బాల్ ప్లేయర్‌కు అమ్మాయి కిస్ ఇవ్వడం, అతడి దుస్తులు చింపేయడం వంటివి చూశాను. ప్లేయర్లు తమ పాపులారిటీని తెలుసుకుని జాగ్రత్తగా ఉండాలి’ అని వ్యాఖ్యానించారు. ఆయనపై విపక్షాలు, ఉమెన్ రైట్స్ గ్రూప్స్ భగ్గుమన్నాయి.