News September 27, 2024
కొడుకుపై ర్యాగింగ్.. RP పట్నాయక్ ఫిర్యాదు

TG: ఓ ప్రైవేట్ కాలేజీలో ఎంబీఏ చదువుతున్న తన కుమారుడు వైష్ణవ్‌ను సీనియర్లు ర్యాగింగ్ చేస్తున్నారంటూ మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పీ పట్నాయక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్యామ్ బస్ అనే సీనియర్ తన కొడుకుతో గొడవపడి చెవి కొరికేశాడని పేర్కొన్నారు. దీంతో కేసు నమోదు చేసిన రాయదుర్గం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News January 7, 2026
భారత్ ఘన విజయం

సౌతాఫ్రికాతో జరిగిన యూత్ మూడో వన్డేలో భారత అండర్-19 జట్టు ఘన విజయం సాధించింది. తొలుత భారత్ 50 ఓవర్లలో 393/7 రన్స్ చేసింది. ఓపెనర్లు ఆరోన్ జార్జ్ (118), వైభవ్ సూర్యవంశీ (127) సెంచరీలతో చెలరేగారు. అనంతరం సౌతాఫ్రికా 35 ఓవర్లలో 160కే కుప్పకూలింది. టాప్-4 ఆటగాళ్లు డబుల్ డిజిట్ స్కోర్ చేయలేకపోయారు. దీంతో 233 పరుగుల భారీ తేడాతో భారత్ విజయదుందుభి మోగించింది. 3 వన్డేల సిరీస్‌ను భారత్ క్లీన్‌స్వీప్ చేసింది.
News January 7, 2026
వాటర్ హీటర్ వాడుతున్నారా?

ఇమ్మర్షన్ రాడ్ వాటర్ హీటర్ వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ‘ప్లాస్టిక్ బకెట్లే వాడాలి. ఇనుప బకెట్లు వద్దు. నీటిలో హీటర్ పెట్టాకే స్విచ్ ఆన్ చేయాలి. హీట్ అవుతున్నప్పుడు నీళ్లను, బకెట్‌ను తాకకూడదు. నీళ్లు వేడయ్యాక స్విచ్ఛాఫ్ చేశాకే రాడ్ తీసేయాలి’ అని చెబుతున్నారు. తాజాగా UP ముజఫర్‌నగర్‌లో లక్ష్మి(19), నిధి(21) అనే అక్కాచెల్లెలు హీటర్ రాడ్ తగిలి విద్యుత్ షాక్‌తో చనిపోయారు.
News January 7, 2026
విక్కీ కౌశల్ కొడుకు పేరు.. ‘Uri’ మూవీతో లింక్!

విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ దంపతులు గతేడాది నవంబర్ 7న <<18223859>>మగబిడ్డకు<<>> జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఇవాళ తమ కొడుక్కి విహాన్ కౌశల్ అని పేరు పెట్టినట్లు వారు వెల్లడించారు. అయితే ఈ పేరుకు ‘Uri: The Surgical Strike’ మూవీతో లింక్ ఉండటం గమనార్హం. 2019 జనవరి 11న రిలీజైన ఈ చిత్రంలో మేజర్ విహాన్ సింగ్ షెర్గిల్ పాత్రను విక్కీ పోషించారు. దానికి గుర్తుగానే విహాన్‌గా నామకరణం చేసినట్లు తెలుస్తోంది.


