News March 13, 2025

KKR కెప్టెన్‌గా రహానే.. కారణం ఇదే

image

కెప్టెన్సీలో అనుభవం ఉన్న కారణంగానే తమ జట్టు కెప్టెన్‌గా రహానేను నియమించామని KKR CEO వెంకీ మైసూర్ తెలిపారు. ‘కెప్టెన్సీ అంటే ఒత్తిడి ఉంటుంది. అది యంగ్ ప్లేయర్లకు భారం. పైగా ఆక్షన్ తర్వాత జరిగే సీజన్ కాబట్టి ఎన్నో ఛాలెంజెస్ ఉంటాయి. అలాగే ప్లేయర్ల నుంచి బెస్ట్‌ను రాబట్టగలగాలి. అందుకే అనుభవమున్న రహానేను ఎంచుకున్నాం. V అయ్యర్ కూడా కెప్టెన్సీ మెటీరియల్. అతను రహానే నుంచి నేర్చుకుంటారు’ అని పేర్కొన్నారు.

Similar News

News November 24, 2025

శత జయంతి ఉత్సవాలు బ్లాక్‌బస్టర్!

image

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలు గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. ఈనెల 13న మొదలై 23న విజయవతంగా ముగిశాయి. లక్షలాది మంది భక్తులు, రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు వేడుకల్లో పాల్గొని బాబాను స్మరించుకున్నారు. ఉత్సవాల్లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, సంగీత కచేరీ, లేజర్ షో ఈవెంట్స్ భక్తులను మైమరపించాయి. జిల్లా అధికారులు, పోలీసులు, సాయి సేవాదళ్ సభ్యులు విశేష సేవలందించి శత జయంతిని సక్సెస్ చేశారు.

News November 24, 2025

భారత్-కెనడా మధ్య ట్రేడ్ టాక్స్ పున:ప్రారంభం!

image

జస్టిన్ ట్రూడో హయాంలో దెబ్బతిన్న కెనడా-భారత్ సంబంధాల పునరుద్ధరణకు అడుగులు పడుతున్నాయి. ద్వైపాక్షిక వాణిజ్యం ఒప్పందాలపై చర్చలను ప్రారంభించేందుకు ఇరు దేశాల PMలు మోదీ, మార్క్ కార్నీ G20 సదస్సులో నిర్ణయించారు. వచ్చే ఏడాది భారత్‌లో పర్యటించేందుకు కార్నీ అంగీకరించారు. రెండు దేశాల మధ్య గత ఏడాది $22 బిలియన్ల వాణిజ్యం జరగగా, 2030 నాటికి $50 బిలియన్లకు చేర్చడమే లక్ష్యమని విదేశాంగశాఖ తెలిపింది.

News November 24, 2025

118 నాన్ టీచింగ్ పోస్టులకు నోటిఫికేషన్

image

<>NIT <<>>దుర్గాపూర్‌ 118నాన్ టీచింగ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 2వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి BE, B.Tech, MSc, MCA, M.LSc, M.P.Ed, MBBS, డిగ్రీ, ఇంటర్, ITI, NET, SET, SLET ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. గ్రూప్-A పోస్టులకు దరఖాస్తు ఫీజు రూ.1500, గ్రూప్ B పోస్టులకు రూ.1000. వెబ్‌సైట్:https://nitdgp.ac.in/