News May 1, 2024

తెలంగాణలో రాహుల్, ప్రియాంక ప్రచార షెడ్యూల్

image

తెలంగాణలో కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ ఈనెల 5,9న.. ప్రియాంకా గాంధీ 5,7,9న ప్రచారం నిర్వహించనున్నారు. 5న నిర్మల్, గద్వాల్, 9న కరీంనగర్, సరూర్‌నగర్ సభల్లో రాహుల్ పాల్గొంటారు. 6న ఎల్లారెడ్డి, తాండూర్, సికింద్రాబాద్, 7న నర్సాపూర్, కూకట్‌పల్లి సభలకు ప్రియాంక హాజరవుతారు. మరోవైపు కేంద్రమంత్రి అమిత్ షా.. HYD బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత తరఫున ప్రస్తుతం లాల్‌దర్వాజలో రోడ్ షో నిర్వహిస్తున్నారు.

Similar News

News March 3, 2026

వ్రతం తర్వాత నాన్ వెజ్ ఏంటని చర్చ!

image

నిన్న విజయ్-రష్మిక దంపతులు గృహప్రవేశం తర్వాత సత్యనారాయణ వ్రతం చేసిన సంగతి తెలిసిందే. అనంతరం <<19280467>>విందు<<>>లో గ్రామస్థులకు మాంసాహార వంటకాలు వడ్డించడాన్ని కొందరు తప్పుబడుతున్నారు. వ్రతం చేసుకుని నాన్ వెజ్ ఏంటని ప్రశ్నిస్తున్నారు. అయితే తెలంగాణలోని పలు ప్రాంతాల్లో గృహప్రవేశం తర్వాత నాన్ వెజ్ వడ్డిస్తారని, మాంసాహారం గ్రామస్థులకు వడ్డిస్తే ఇబ్బంది ఏంటని మరికొందరు కౌంటర్ ఇస్తున్నారు. దీనిపై మీ COMMENT?

News March 3, 2026

కల్తీ పాలు, బాణసంచా పేలుడు.. పెరిగిన మృతుల సంఖ్య

image

AP: రాష్ట్రంలో తీవ్ర విషాదం నింపిన కాకినాడ(D) వేట్లపాలెం బాణసంచా పేలుడు <<19266434>>ఘటనలో<<>> మృతుల సంఖ్య 23కి చేరింది. GGHలో చికిత్స పొందుతూ లోవరాజు(38) అనే వ్యక్తి మృతి చెందారు. అటు రాజమండ్రి కల్తీ పాల ఘటనలో మృతుల సంఖ్య 7కి చేరింది. చౌడేశ్వర్ నగర్‌కు చెందిన సూర్యారావు(81) ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. మరో 13 మంది బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

News March 3, 2026

జగన్‌ను కలిసిన భట్టి

image

AP: తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తాడేపల్లిలో మాజీ సీఎం జగన్‌ను కలిశారు. తన కుమారుడి వివాహ ఆహ్వానపత్రికను అందజేసి, వేడుకకు రావాలని కోరారు. జగన్ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసి, వధూవరులు నిండైన దాంపత్య జీవితం గడపాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు ఆత్మీయంగా హత్తుకొని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కాగా భట్టి దివంగత వైఎస్సార్‌ను ఎంతగానో అభిమానిస్తారు.