News April 25, 2024
అయోధ్య ఆలయానికి వెళ్లనున్న రాహుల్, ప్రియాంక?

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంకా గాంధీ అయోధ్య బాలరాముడి దర్శనానికి వెళ్లనున్నట్లు ప్రచారం జరుగుతోంది. యూపీలోని అమేథీ నుంచి రాహుల్, రాయ్‌బరేలీ నుంచి ప్రియాంక లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తారని సమాచారం. ఈ రెండు స్థానాలకు నామినేషన్ గడువు మే 3వ తేదీతో ముగియనుండగా, నామినేషన్‌కు రెండు రోజుల ముందు వారిద్దరూ అయోధ్య రామున్ని దర్శించుకోనున్నారట. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Similar News
News January 30, 2026
నెయ్యి పేరుతో YCP రూ.250కోట్ల కుంభకోణం: జనసేన

AP: నెయ్యి వాడకుండానే దాని పేరుతో YCP ప్రభుత్వం రూ.250కోట్ల కుంభకోణం చేసిందని జనసేన ఆరోపించింది. ‘‘ఆవు నెయ్యికి బదులు ప్రమాదకర రసాయనాలతో 68లక్షల కిలోల సింథటిక్ నెయ్యి వాడి లడ్డూ ప్రసాదాన్ని TTD గత పాలకులు దోపిడీకి కేంద్రంగా చేసుకున్నారు. నెయ్యి సేకరణలో కుట్ర, ఫేక్ డాక్యుమెంట్ల వినియోగం, అధికార దుర్వినియోగంపై ఆధారాలున్నట్టు CBI నేతృత్వంలోని SIT దర్యాప్తులో తేలింది’’ అని SMలో పోస్టు పెట్టింది.
News January 30, 2026
‘వారణాసి’ మూవీ రిలీజ్ తేదీ ప్రకటించిన జక్కన్న

సూపర్ స్టార్ మహేశ్‌బాబు హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ అడ్వెంచర్ మూవీ ‘వారణాసి’ రిలీజ్ తేదీని దర్శక ధీరుడు రాజమౌళి ప్రకటించారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ప్రియాంకా చోప్రా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు.
News January 30, 2026
గుమ్మడి గింజలతో ఎన్నో లాభాలు

గుమ్మడి గింజల్లో కొవ్వు ఆమ్లాలు, జింక్, భాస్వరం, పొటాషియం వంటి అమైనో ఆమ్లాలు, ఫినోలిక్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీమైక్రోబయల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆర్థరైటిక్‌తో పాటు యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఉన్నాయి. రక్తంలో చెడు కొలస్ట్రాల్‌ను తొలగించి మంచి కొలస్ట్రాల్ పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. రక్తప్రసరణ సరిగా జరిగేలా చేసి బీపీని అదుపులో ఉండేలా చేస్తుంది. గుండె సంబంధిత సమస్యలు దరిచేరకుండా చేస్తుంది.


