News September 11, 2024
రాహుల్.. బీజేపీ ఉన్నంత వరకు రిజర్వేషన్లను రద్దు చేయలేరు: షా

రిజర్వేషన్ల రద్దుపై మాట్లాడిన రాహుల్ గాంధీ కాంగ్రెస్ రిజర్వేషన్ వ్యతిరేక వైఖరిని బయటపెట్టారని HM అమిత్ షా అన్నారు. BJP ఉన్నంత వరకు ఎవరూ వాటిని రద్దు చేయలేరని, జాతి భద్రతకు విఘాతం కలిగించలేరని తెలిపారు. ‘దేశ విభజనకు కుట్రలు చేసేవారికి (JKNC) మద్దతివ్వడం, జాతి వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం రాహుల్ గాంధీ, కాంగ్రెస్కు అలవాటుగా మారాయి. భాష, మతం, ప్రాంతం పేరుతో ఆయన చిచ్చు పెడుతున్నారు’ అని విమర్శించారు.
Similar News
News November 22, 2025
నాన్న 50ఏళ్లు ఇండస్ట్రీని తన భుజాలపై మోశారు: విష్ణు

తెలుగు సినిమా పరిశ్రమలో మంచు మోహన్ బాబు 50ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మంచు విష్ణు ఎమోషనల్ పోస్ట్ చేశారు. ’94 ఏళ్ల తెలుగు చిత్ర పరిశ్రమను 50 ఏళ్లు మా నాన్న తన భుజాలపై మోశారు. ఆయన అసాధారణ ప్రయాణాన్ని చూడగలిగినందుకు ఎంతో గర్వంగా ఉంది. 50 లెజెండరీ ఇయర్స్ పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు నాన్న’ అని ట్వీట్ చేశారు. ప్యారడైజ్ మూవీలో మోహన్ బాబు నటిస్తున్న విషయం తెలిసిందే.
News November 22, 2025
గుర్తులేదు.. మరిచిపోయా: ఐబొమ్మ రవి

TG: మూడో రోజు పోలీసుల విచారణలో ఐబొమ్మ రవి సమాధానాలు దాట వేసినట్లు తెలుస్తోంది. అడిగిన ప్రశ్నలకు పొంతనలేని సమాధానాలు చెప్పాడట. బ్యాంకు ఖాతాల వివరాలపైనా నోరు విప్పలేదని సమాచారం. యూజర్ ఐడీ, పాస్వర్డ్లు అడిగితే గుర్తులేదని, మరిచిపోయానని తెలిపినట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో ఎథికల్ హ్యాకర్ల సాయంతో హార్డ్డిస్క్లు, పెన్డ్రైవ్లు ఓపెన్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
News November 22, 2025
ఇతిహాసాలు క్విజ్ – 74 సమాధానాలు

ప్రశ్న: విష్ణుమూర్తి ద్వార పలుకులు అయిన జయవిజయులు అసురులుగా ఎందుకు జన్మించారు?
సమాధానం: ఓసారి సనక సనందనాది మహర్షులు విష్ణు దర్శనానికి రాగా, వీరు వారిని లోపలికి అనుమతించలేదు. దీంతో కోపించిన మహర్షులు వారిని భూలోకంలో రాక్షసులుగా జన్మించమని శపించారు. వీరు 3 జన్మలలో (హిరణ్యాక్ష-హిరణ్యకశిప, రావణ-కుంభకర్ణ, శిశుపాల-దంతవక్ర) అసురులుగా పుట్టి, స్వామి చేతిలోనే మరణించి తిరిగి వైకుంఠం చేరారు.<<-se>>#Ithihasaluquiz<<>>


