News October 18, 2024

కొత్త అవతారంలో రాహుల్ చౌదరి

image

తెలుగు టైటాన్స్ మాజీ కెప్టెన్, కబడ్డీ స్టార్ ప్లేయర్ రాహుల్ చౌదరి ప్రొకబడ్డీకి వీడ్కోలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇవాళ్టి నుంచి సీజన్ ప్రారంభం కానుండగా రాహుల్ కొత్త అవతారంలో కనిపించారు. కబడ్డీ అనలిస్ట్‌గా, హ్యాండ్సమ్ లుక్‌లో ఆయన దర్శనమిచ్చారు. 31 ఏళ్ల రాహుల్ చౌదరిని ఈ సారి వేలంలో ఏ ఫ్రాంచైజీ కొనేందుకు ఆసక్తి చూపించలేదు.

Similar News

News October 18, 2024

టెస్టు క్రికెట్‌ చరిత్రలో భారత్ సరికొత్త రికార్డు

image

టెస్టు క్రికెట్ చరిత్రలో ఓ క్యాలెండర్ ఇయర్‌లో 100 సిక్సర్లు బాదిన జట్టుగా భారత్ నిలిచింది. ఈ ఏడాది ఇప్పటివరకు టీమ్ ఇండియా 102 సిక్సర్లు బాదింది. అంతకుముందు ఇంగ్లండ్(89-2022) పేరిట ఈ రికార్డు ఉంది. ఆ తర్వాతి స్థానంలోనే భారత జట్టు(81-2021) ఉండటం విశేషం.

News October 18, 2024

విద్యా కమిషన్ సభ్యులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ

image

TG: రాష్ట్ర విద్యా కమిషన్ సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పీఎల్ విశ్వేశ్వర్ రావు, వెంకటేశ్, జ్యోత్స్నను నియమించింది. అంతకుముందు కమిషన్ ఛైర్మన్‌గా ఆకునూరి మురళిని నియమించిన సంగతి తెలిసిందే.

News October 18, 2024

డిప్యూటీ కలెక్టర్ పీవీ సింధు ఓడీ సదుపాయం మరో ఏడాది పొడిగింపు

image

AP: స్టార్ షట్లర్ పీవీ సింధు ఆన్‌డ్యూటీ సదుపాయాన్ని ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ప్రస్తుతం డిప్యూటీ కలెక్టర్ హోదాలో ఉన్న సింధు హైదరాబాద్‌లో ఏపీ అధీనంలోని లేక్‌వ్యూ అతిథిగృహం ఓఎస్డీగా కొనసాగుతున్నారు. అయితే అంతర్జాతీయ పోటీల్లో శిక్షణ కోసం ఆమెకు 2025 సెప్టెంబర్ 30 వరకు ఆన్ డ్యూటీ సౌకర్యం కల్పిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వరుసగా ఆరోసారి దీన్ని పొడిగించినట్లు వెల్లడించింది.