News September 11, 2024
రాహుల్ వ్యాఖ్యలు: సోనియా ఇంటి ముందు సిక్కుల ధర్నా

అమెరికాలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కొన్ని సిక్కు సంఘాలు భగ్గుమన్నాయి. బుధవారం సోనియా గాంధీ ఇంటిముందు ఆందోళన చేపట్టాయి. ఆయన మాటలు సరికాదంటూ నిరసన వ్యక్తం చేశాయి. మత స్వేచ్ఛ గురించి మాట్లాడుతూ భారత్లో సిక్కుల ఉనికికి ముప్పు ఉందంటూ రాహుల్ పేర్కొన్న సంగతి తెలిసిందే. దేశంలో సిక్కులు తలపాగా ధరించేందుకు అనుమతించే పరిస్థితి ఉందా అన్నారు. RSS, BJPతో తాము సైద్ధాంతిక పోరాటం చేస్తున్నామని పేర్కొన్నారు.
Similar News
News November 17, 2025
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు ఉత్తర్వులు

AP: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీపై ప్రభుత్వం జీవో జారీ చేసింది. అంతర్జిల్లాల బదిలీలకు అవకాశం కల్పించింది. కొత్త గైడ్లైన్స్ ప్రకారం బదిలీలు ఉంటాయని పేర్కొంది. డిసిప్లినరీ, ACB కేసులు ఉన్నవారు ట్రాన్స్ఫర్కు అనర్హులని తెలిపింది. ప్రొవిజనల్ సీనియారిటీ, క్లియర్ వేకెన్సీ ఆధారంగా బదిలీ అవుతారంది. పోర్టల్ ద్వారానే అప్లై చేసుకోవాలని, శాఖా సెక్రటరీలు ఇంటర్ బదిలీ ఆర్డర్లు ఇస్తారని తెలిపింది.

సర్పంచ్ ఎన్నికలకు 10 రోజుల్లోపే నోటిఫికేషన్?

TG: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ భేటీ సుదీర్ఘంగా కొనసాగుతోంది. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలపైనే చర్చిస్తున్నారు. తొలుత వచ్చే నెలలో షెడ్యూల్ ఇవ్వాలని భావించినా దాన్ని ఈ నెలలో విడుదల చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. SC ఆదేశాల ప్రకారం 50% రిజర్వేషన్లు మించకుండా ఎన్నికలకు వెళ్లాలని డిసైడ్ అయినట్లు టాక్. తొలుత నిర్వహించే సర్పంచ్ ఎన్నికలకు 10 రోజుల్లోపే నోటిఫికేషన్ రానున్నట్లు సమాచారం.