News August 24, 2025
రాహుల్‌కు, కాంగ్రెస్‌కు బిహార్‌లో గౌరవం లేదు: ప్రశాంత్ కిషోర్

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి, ఆయన పార్టీకి బిహార్‌లో ఎలాంటి గౌరవం లేదని జన్ సూరజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీ RJDని అనుసరిస్తుందని విమర్శించారు. బిహార్‌లోని ప్రధాన సమస్యలైన వలస, అవినీతి, విద్య వంటి అంశాల గురించి ప్రస్తావించకుండా రాహుల్, PM మోదీ ఒకరిపై ఒకరు పరస్పర విమర్శలు చేసుకుంటున్నారని మండిపడ్డారు. దీంతో ప్రజలు తన పార్టీవైపే చూస్తున్నారని చెప్పారు.
Similar News
News August 24, 2025
13 ఏళ్ల బాలికను పెళ్లి చేసుకున్న కానిస్టేబుల్.. చివరకు

TG: సూర్యాపేట(D) నడిగూడెం PSలో పనిచేసే కానిస్టేబుల్ కృష్ణంరాజు నిత్యపెళ్లి కొడుకు అవతారమెత్తాడు. ముగ్గురికి విడాకులిచ్చిన రాజు రెండేళ్ల క్రితం 13 ఏళ్ల బాలికను నాలుగో పెళ్లి చేసుకున్నాడు. అతని అసలు రూపం తెలియడంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసి అతనిపై పోక్సో కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న అతని కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.
News August 24, 2025
సంపన్న సీఎంగా చంద్రబాబు.. ఎలా అంటే?

చంద్రబాబు 1992లో రూ.7వేల పెట్టుబడితో హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ స్థాపించారు. 1994లో IPOకు వెళ్లగా రూ.6.5 కోట్లు సమకూరాయి. 1995లో దీని మార్కెట్ వాల్యూ రూ.25 కోట్లు ఉండగా 2025లో రూ.4,500 కోట్లకు చేరింది. చంద్రబాబు 1994లో మంత్రి కాగానే తన భార్య భువనేశ్వరికి హెరిటేజ్ బాధ్యతలు అప్పగించారు. ఇందులో భువనేశ్వరికి 24.37% వాటా ఉంది. దీన్ని చంద్రబాబు సంపదగా పరిగణించడంతో ఆయన దేశంలో అత్యంత <<17489958>>సంపన్న<<>> CMగా నిలిచారు.
News August 24, 2025
సల్వాజుడుం గురించి తెలుసా?

ఛత్తీస్‌గఢ్‌లో నక్సలైట్ల ఏరివేతకు ప్రభుత్వం 2005లో ‘సల్వాజుడుం’ విధానాన్ని తీసుకొచ్చింది. గిరిజనులను పోలీసులుగా నియమించి, వారికి ఆయుధాలు సమకూర్చడమే దీని లక్ష్యం. ఇది మానవ హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని కొందరు పిటిషన్ వేశారు. దీంతో సుదర్శన్ రెడ్డి జడ్జిగా ఉన్న సుప్రీంకోర్టు బెంచ్ సల్వాజుడుంను రద్దు చేసింది. ఈ విధానం ఉంటే 2020లోపే నక్సలిజం అంతమయ్యేదని <<17494765>>అమిత్ షా<<>> సుదర్శన్ రెడ్డిని విమర్శించారు.