News September 11, 2024
అమెరికాలో కలుసుకున్న రాహుల్-డీకే

అమెరికా పర్యటనలో ఉన్న ఏఐసీసీ అగ్ర నేత రాహుల్ గాంధీని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కలుసుకున్నారు. వీరిద్దరూ ఆప్యాయంగా మాట్లాడుకుంటూ కనిపించారు. కాగా వ్యక్తిగత పర్యటన నిమిత్తం డీకే తన భార్య ఉషాతో కలిసి యూఎస్ వెళ్లారు. మరోవైపు భారతీయ అమెరికన్లు, విద్యార్థులను కలిసేందుకు రాహుల్ గాంధీ అక్కడకు వెళ్లారు. ఈ క్రమంలో వీరిద్దరూ వాషింగ్టన్ డీసీలో కలిశారు.
Similar News
News December 13, 2025
భూపాలపల్లి: రెండో విడత ఎన్నికలకు పటిష్ఠ బందోబస్తు

పలిమెల, భూపాలపల్లి, చిట్యాల, టేకుమట్ల మండలాల్లో రెండో విడత ఎన్నికల పోలింగ్‌కు 600 మంది పోలీసు సిబ్బందితో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ తెలిపారు. పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడటం, ప్రచారం చేయడం పూర్తిగా నిషేధమని ఎస్పీ స్పష్టం చేశారు.
News December 13, 2025
వంటింటి చిట్కాలు

* బియ్యం డబ్బాలో నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఉంచితే పురుగు చేరదు.
* వండటానికి ముందు ఆకుకూరలను పంచదార నీళ్ళలో ఉంచితే కూరలు రుచిగా వుంటాయి.
* అరిసెలు వండేటప్పుడు పాకంలో బియ్యం పిండి సరిపోకపోతే తగినంత గోధుమపిండి కలపండి.
* పెండలం, కంద దుంపలు ముక్కలుగా కోసిన తరువాత కాసేపు పెరుగులో ఉంచితే జిగురు పోతుంది. కూర రుచిగా ఉంటుంది.
News December 13, 2025
అఖండ-2.. తొలిరోజు రూ.59.5 కోట్ల కలెక్షన్లు

బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన అఖండ-2 సినిమా బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది. ప్రీమియర్స్‌తో కలిపి తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.59.5 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లు మేకర్స్ వెల్లడించారు. బాలయ్య కెరీర్లో ఇవే బిగ్గెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్లు అని తెలిపారు. నిన్న విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చిన విషయం తెలిసిందే. ఆది పినిశెట్టి, సంయుక్త, హర్షాలీ కీలక పాత్రలు పోషించారు.


