News September 15, 2024

రాహుల్ గాంధీ ఓ టెర్రరిస్ట్: కేంద్రమంత్రి

image

రాహుల్ గాంధీపై కేంద్రమంత్రి రవ్‌నీత్‌సింగ్ బిట్టూ కీలక వ్యాఖ్యలు చేశారు. రాహుల్ నంబర్ వన్ టెర్రరిస్ట్ అని వ్యాఖ్యానించారు. ఆయన తలపై కేంద్రం రివార్డు ప్రకటించాలని అన్నారు. సిక్కులను రాహుల్ విభజించే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు.

Similar News

News November 23, 2025

గుంటూరు: CCI పత్తి కొనుగోళ్లు ప్రారంభం

image

2025–26 సీజన్‌కు పత్తి కొనుగోళ్లు ప్రారంభించినట్టు CCI జనరల్ మేనేజర్ రాజేంద్ర షా శనివారం తెలిపారు. రాష్ట్రంలో 30 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసినట్లు పేర్కొన్నారు. MSP కింద పత్తి అమ్మడానికి Kapas Kisan App ద్వారా స్లాట్‌బుక్ చేసుకోవాలని రైతులకు సూచించారు. తేమ 8% లోపు ఉంటే పూర్తి MSP, 8–12% మధ్య ఉంటే తగ్గింపులు ఉంటాయని తెలిపారు. సహాయం కోసం WhatsApp హెల్ప్‌లైన్ 7659954529 అందుబాటులో ఉందన్నారు.

News November 23, 2025

కుజ దోషం అంటే ఏంటి?

image

ఓ వ్యక్తి జాతక చక్రంలో కుజుడు 1, 4, 7, 8, 12 స్థానాల్లో ఉంటే అతనికి కుజ దోషం ఉన్నట్లు పరిగణిస్తారు. జ్యోతిషం ప్రకారం.. ఈ దోషం ఉన్నవారికి బలమైన కోరికలుంటాయి. ఎప్పుడూ అహం, ఆవేశంతో ఊగిపోతారని, వివాహం ఆలస్యంగా అవుతుందని, వైవాహిక జీవితంలో సమస్యలుంటాయని నమ్ముతారు. అయితే వీటన్నింటికీ జ్యోతిష శాస్త్రంలో పరిహారాలున్నాయని పండితులు చెబుతున్నారు.
☞ వాటి గురించి తెలుసుకోవడానికి <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>కి వెళ్లండి.

News November 23, 2025

కుజ దోషం తొలగిపోవాలంటే?

image

కుజ దోష ప్రభావాన్ని తగ్గించుకోవడానికి ‘ఓం అంగారకాయ విద్మహే శక్తి హస్తాయ ధీమహీ.. తన్నో అంగారక ప్రచోదయాత్’ అనే గాయత్రి మంత్రాన్ని పఠించాలని జ్యోతిష నిపుణులు సూచిస్తున్నారు. క్రమం తప్పకుండా హనుమాన్ చాలీసా పఠించాలని చెబుతున్నారు. సమీపంలోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయాల్లో మంగళవారం రోజున దాన ధర్మాలు చేయడం, హనుమంతుడిని పూజించడం ఎంతో మంచిదని అంటున్నారు.