News October 2, 2024

రాహుల్ గాంధే హైడ్రాను నడిపిస్తున్నారు: కేటీఆర్

image

TG: రేవంత్ రెడ్డి కాదు రాహుల్ గాంధే హైడ్రాను నడిపిస్తున్నారని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘రాహుల్ వెనకుండి పేదల ఇళ్లపైకి బుల్డోజర్లు పంపిస్తున్నారు. డబ్బుల కోసమే మూసీ ప్రాజెక్టుకు అనుమతిచ్చారు. కాంగ్రెస్ పార్టీకి నోట్ల కట్టలు కావాలి కానీ బాధితుల కష్టాలు పట్టవా? రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ కుదేలైంది’ అని మీడియాతో చిట్‌చాట్‌లో విమర్శించారు.

Similar News

News November 17, 2025

రూ.లక్ష కోట్లకు Groww

image

స్టాక్ బ్రోకింగ్ సంస్థ Groww పేరెంట్ కంపెనీ బిలియన్ బ్రెయిన్స్ గ్యారేజ్ వెంచర్స్ స్టాక్ మార్కెట్ లిస్టింగ్‌లో అదరగొట్టింది. వరుసగా నాలుగు రోజులు లాభాలు సాధించింది. ఇవాళ షేర్ వాల్యూ మరో 13 శాతం పెరిగి అత్యధికంగా రూ.169.79కి చేరింది. ఇష్యూ ధర రూ.100తో పోలిస్తే దాదాపు 70 శాతం పెరుగుదల నమోదైంది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1.05 లక్షల కోట్లను తాకింది.

News November 17, 2025

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి: నంద్యాల కలెక్టర్

image

నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు కలెక్టర్‌తో పాటు వివిధ అధికారులను కలిసి వినతి పత్రాలు అందజేశారు. వచ్చిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు.

News November 17, 2025

ఏపీ న్యూస్ రౌండప్

image

* సౌదీ బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.
* మద్యం కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేశ్ నాయుడు బెయిల్ పిటిషన్లపై విచారణను ఏసీబీ కోర్టు రేపటికి వాయిదా వేసింది.
* వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌పై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై కార్మికులు ఆందోళనకు దిగారు. మెటీరియల్ సరఫరా చేయకుండా ప్రభుత్వ వైఫల్యాలను తమపై మోపడం సరికాదన్నారు.