News June 4, 2024
30 వేల ఓట్ల ఆధిక్యంలో రాహుల్ గాంధీ

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్, యూపీలోని రాయ్బరేలీ స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. వయనాడ్లో ప్రస్తుతం 30వేల ఓట్ల లీడింగ్లో ఉన్నారు. 2019లో ఆయన ఇక్కడ 5లక్షలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందిన సంగతి తెలిసిందే.
Similar News
News November 24, 2025
సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అమలు చేయాలి: కలెక్టర్

కేంద్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను పూర్తి స్థాయిలో అములు చేసి జిల్లాకు ప్రధానమంత్రి అవార్డు వచ్చేలా సంబంధిత అధికారులు కృషి చేయాలని బాపట్ల కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ తెలిపారు. సోమవారం రాత్రి కలెక్టరేట్లోని న్యూ వీడియో కాన్ఫరెన్స్ హల్లో 2026 ప్రధానమంత్రి అవార్డుకు సంబంధించి వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. అధికారులు అందరూ సమన్వయంతో పనిచేయాలన్నారు.
News November 24, 2025
మొబైల్ యూజర్లకు బిగ్ అలర్ట్

మొబైల్ యూజర్లకు టెలికం శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తమ పేరుతో ఉన్న SIM దుర్వినియోగం అయితే వినియోగదారులదే బాధ్యత అని స్పష్టం చేసింది. సిమ్ కార్డులను సైబర్ మోసాలు, చట్టవ్యతిరేక కార్యక్రమాలకు వాడినట్లు తేలితే చర్యలు తీసుకుంటామని తెలిపింది. తమ ఐడెంటిటీతో లింక్ అయిన సిమ్ కార్డులు, డివైస్ల విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. <<18316809>>IMEI<<>> నంబర్లను ట్యాంపర్ చేసిన ఫోన్లను ఉపయోగించవద్దని సూచించింది.
News November 24, 2025
టికెట్ ధరల పెంపు.. తప్పుగా తీసుకోవద్దు: మైత్రీ రవి

టికెట్ ధరల పెంపుపై మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతల్లో ఒకరైన రవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘మేము ఇండస్ట్రీ వృద్ధి కోసమే డబ్బును ఖర్చు చేస్తున్నాం. ఈ కారణంతో 6-7 సినిమాలకు టికెట్ ధరలు పెంచుతున్నాం. ఆ పెంపు రూ.100 మాత్రమే. ఈ అంశాన్ని తప్పుగా తీసుకోవద్దు’ అని చెప్పారు. కాగా టికెట్ ధరల పెంపుపై ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్న సంగతి తెలిసిందే.


