News February 19, 2025

శివాజీ జయంతికి రాహుల్ గాంధీ శ్రద్ధాంజలి..

image

ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ట్వీట్ చేసిన తీరుపై విమర్శలు వస్తున్నాయి. జయంతి వేళ ఆయన శ్రద్ధాంజలి ఘటిస్తున్నానని రాయడమే ఇందుకు కారణం. సాధారణంగా వర్ధంతులకే ఇలా చెప్తుంటారు. మహారాష్ట్ర ఎన్నికల వేళ శివాజీ విగ్రహాలను తీసుకొనేందుకు ఆయన వెనుకాడటం, నిర్లక్ష్యం చేయడాన్ని కొందరు యూజర్లు గుర్తుచేస్తున్నారు.

Similar News

News January 25, 2026

బొప్పాయిలో ఫంగల్ ఇన్ఫెక్షన్లు.. నివారణ ఇలా

image

ఫంగల్ ఇన్ఫెక్షన్లు లేదా ఆంత్రాక్నోస్ కారణంగా బొప్పాయి చెట్ల ఆకులపై గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. ఇవి పెద్దవిగా మారి ఆకులకు రంధ్రాలు ఏర్పడి రాలిపోతాయి. వ్యాధి తీవ్రమైతే పండ్లు నాశనమవుతాయి. ఈ లక్షణాలు కనిపించిన ఆకులను ఏరివేసి నాశనం చేయాలి. చెట్ల మొదట్లో నీరు నిలిచిపోకుండా చూసుకోవాలి. లీటరు నీటికి మాంకోజెబ్ 2.5గ్రా. లేదా క్లోరోథలోనిల్ 2 గ్రా. కలిపి 15 రోజుల వ్యవధిలో రెండు దఫాలుగా పిచికారీ చేయాలి.

News January 25, 2026

CMను కాపాడేందుకే భట్టి అవాస్తవాలు: హరీశ్ రావు

image

TG: సింగరేణి టెండర్లపై Dy.CM <<18943021>>భట్టి విక్రమార్క<<>> చెప్పినవన్నీ అవాస్తవాలని BRS నేత హరీశ్ రావు మండిపడ్డారు. CM రేవంత్‌ను ‘స్కామ్’ నుంచి కాపాడేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. గతంలో లేని సైట్ విజిట్ నిబంధనను తమ వారికి లబ్ధి చేకూర్చడానికే 2025లో తెచ్చారన్నారు. టెండర్ల ప్రక్రియలో నిపుణుల సంస్థలను పక్కన పెట్టి సింగరేణికి నష్టం కలిగించారని, లబ్ధిదారులెవరో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు.

News January 25, 2026

ICC నిర్ణయాన్ని గౌరవిస్తాం.. సవాలు చేయబోం: బంగ్లాదేశ్

image

T20 WC నుంచి తమను ICC తొలగించడంపై బంగ్లాదేశ్ అధికారికంగా స్పందించింది. <<18948168>>బోర్డు నిర్ణయాన్ని<<>> గౌరవిస్తున్నట్లు తెలిపింది. ‘మేం మా వంతు ప్రయత్నించాం. మ్యాచుల వేదికలు మార్చలేమని బోర్డు నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాతా మా సొంత మార్గాల్లో ట్రై చేశాం. కానీ వాళ్లు సుముఖంగా లేకపోతే మేం మాత్రం ఏం చేయలేం. ఆ నిర్ణయాన్ని సవాలు చేయబోం’ అని BCB మీడియా కమిటీ ఛైర్మన్ అమ్జాద్ హుస్సేన్ చెప్పారు.