News September 12, 2024
రాహుల్ గాంధీ-ప్రణితి షిండే పెళ్లంటూ ప్రచారం!

దేశంలోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ కమ్ పొలిటీషియన్ రాహుల్ గాంధీ(54) త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్ కుమార్ షిండే కుమార్తె, సోలాపూర్ ఎంపీ ప్రణితి షిండే(44)ను ఆయన వివాహం చేసుకుంటారని సమాచారం. దీంతో వారిద్దరి ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. దీనిపై ఇరు కుటుంబాలు, కాంగ్రెస్ పార్టీ ఎలాంటి ప్రకటనా చేయలేదు.
Similar News
News December 3, 2025
సూర్యాపేట: ప్రారంభమైన మూడో విడత నామినేషన్ ప్రక్రియ

జిల్లాలోని ఏడు మండలాలకు సంబంధించిన 146 గ్రామ పంచాయతీ స్థానాలకు నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. డిసెంబర్ 5 వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ దశలో సూర్యాపేట జిల్లాలోని హుజూర్నగర్ నియోజకవర్గం పరిధిలోని గ్రామాలకు నామినేషన్ల ప్రక్రియ జరగనుంది. ఈ దశలో మేళ్లచెరువు వంటి పెద్ద గ్రామపంచాయతీలు ఎక్కువగా ఉండటం.. అధిక ఓటర్లు ఉన్న గరిడేపల్లి మండలం ఉండడంతో నామినేషన్లు భారీగా వచ్చే అవకాశాలు ఉన్నాయి.
News December 3, 2025
124 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(C<
News December 3, 2025
‘సంచార్ సాథీ’తో 7 లక్షల ఫోన్లు రికవరీ: PIB

<<18445876>>సంచార్ సాథీ<<>> గురించి వివాదం కొనసాగుతోన్న వేళ.. ఆ యాప్ గురించి PIB వివరించింది. ఈ ఏడాది జనవరి 17న ప్రారంభమైన ఈ యాప్నకు 1.4 కోట్లకుపైగా డౌన్లోడ్లు ఉన్నాయని పేర్కొంది. ఇప్పటివరకు 42 లక్షల దొంగిలించిన ఫోన్లను బ్లాక్ చేసి, 26 లక్షలకు పైగా మొబైల్లను ట్రేస్ చేసినట్లు వెల్లడించింది. వీటిలో 7.23 లక్షల ఫోన్లు తిరిగి ఓనర్ల వద్దకు చేరాయని, యూజర్ల ప్రైవసీకి పూర్తి ప్రాధాన్యం ఉంటుందని తెలిపింది.


