News July 28, 2024
చెప్పులు కుట్టే వ్యక్తికి మెషీన్ పంపిన రాహుల్ గాంధీ

రెండు రోజుల క్రితం యూపీలోని సుల్తానాపూర్లో ఓ చెప్పులు కుట్టే వ్యక్తితో రాహుల్ <<13712121>>ముచ్చటించిన<<>> సంగతి తెలిసిందే. ఆ వ్యక్తికి నిన్న రాహుల్ చెప్పులు కుట్టే మెషీన్ను బహుమతిగా పంపారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ ‘చెప్పులు కుట్టే రామ్చేత్ సమస్యలను జననాయక్ రాహుల్ గాంధీ అర్థం చేసుకున్నారు. అతనికి చెప్పులు కుట్టే యంత్రం పంపారు. ఇది అతని పనిని సులభం చేస్తుంది’ అని కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది.
Similar News
News October 15, 2025
వంటింటి చిట్కాలు

* టమాటా, పండు మిరపకాయ పచ్చళ్లు ఎర్రగా ఉండాలంటే తాలింపులో వంటసోడా కలిపితే సరిపోతుంది.
* కూరల్లో గ్రేవీ పలచగా అయినప్పుడు కాస్త మొక్కజొన్న పిండి కలిపితే గట్టిపడుతుంది.
* ఇడ్లీ పిండి పలుచగా అయినప్పుడు దానిలో చెంచా బ్రెడ్ పొడి, పావు చెంచా మొక్కజొన్న పిండిని నీళ్లలో కలిపి చేర్చితే పిండి గట్టిగా అవడంతో పాటు ఇడ్లీలు మృదువుగా వస్తాయి.
News October 15, 2025
అన్ని ప్రాంతాల అభివృద్ధే మా లక్ష్యం: లోకేశ్

AP: అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధే తమ లక్ష్యమని మంత్రి లోకేశ్ అన్నారు. ‘ఉత్తరాంధ్రలో TCS, కాగ్నిజెంట్, యాక్సెంచర్, తిరుపతి శ్రీసిటీలో డైకెన్, బ్లూస్టార్, LG సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయి. గోదావరి జిల్లాల్లో ఆక్వాను ప్రోత్సహిస్తున్నాం. చిత్తూరు, కడపలో ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ ఎకో సిస్టమ్ అభివృద్ధి చేస్తున్నాం. అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ తీసుకొస్తున్నాం’ అని వెల్లడించారు.
News October 15, 2025
ఈశాన్య రుతుపవనాలు.. దేశంలోకి రేపే ఎంట్రీ!

ఈశాన్య రుతుపవనాలు గురువారం(oct-16) దేశంలోకి ప్రవేశించనున్నట్లు IMD పేర్కొంది. తర్వాత 1,2 రోజులకు APలో విస్తరించే అవకాశం ఉంది. ఈశాన్య రుతుపవనాల వల్ల ఈ నెల నుంచి డిసెంబర్ వరకు తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. అటు బంగాళాఖాతంలో ఈ నెల 22, 23 నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.