News May 4, 2024
దళితులకు రాహుల్ గాంధీ సారీ చెప్పాలి: బీజేపీ

రోహిత్ వేముల మృతిని రాహుల్ గాంధీ రాజకీయం చేశారని, దళితులకు క్షమాపణలు చెప్పాలని బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ డిమాండ్ చేశారు. ‘తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. రోహిత్ దళితుడు కాదని, అతడి మృతి ఆత్మహత్యేనని అక్కడి పోలీసులు కోర్టుకిచ్చిన క్లోజర్ రిపోర్టులో పేర్కొన్నారు. కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు దళితుల్ని రాజకీయం కోసమే వాడుకున్నాయి. వారికి న్యాయం చేయడంలో పూర్తిగా విఫలమయ్యాయి’ అని మండిపడ్డారు.
Similar News
News December 3, 2025
TG హైకోర్టు న్యూస్

* బీసీ రిజర్వేషన్లపై స్టేను హైకోర్టు పొడిగించింది. జనవరి 29 వరకు జీవో 9ని నిలిపివేస్తూ ఉత్తర్వులు.. తదుపరి విచారణను అదేరోజుకు వాయిదా
* లిఫ్ట్ ప్రమాదాల నేపథ్యంలో లిఫ్ట్, ఎలివేటర్ నిబంధనలపై రాష్ట్ర ప్రభుత్వ తీరును తప్పుబట్టిన హైకోర్టు.. చట్టం రూపొందించడానికే పదేళ్లు పడితే అమల్లోకి తేవడానికి ఇంకా ఎన్నేళ్లు కావాలని ప్రశ్న. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా
News December 3, 2025
సమంత-రాజ్.. కొత్త ఫొటోలు చూశారా?

హీరోయిన్ సమంత, డైరెక్టర్ రాజ్ నిడిమోరు వివాహ బంధంలోకి అడుగుపెట్టడం హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. సమంత మెహిందీ వేడుకకు సంబంధించిన ఫొటోలు బయటకు వచ్చాయి. ఆమె నవ్వుతూ చేతులు చూపిస్తుండగా, రాజ్ ఫొటోలు తీశారు. సమంత క్లోజ్ ఫ్రెండ్ ఒకరు వీటిని SMలో పోస్ట్ చేశారు. ‘సమంత.. ఈ పెళ్లితో నీలో కొత్త రకమైన సంతోషాన్ని చూస్తున్నా. మీరిద్దరూ ఇలాగే కలకాలం కలిసుండాలి’ అని పేర్కొన్నారు.
News December 3, 2025
DCM అంటే దిష్టి చుక్క మంత్రి.. పవన్‌పై YCP సెటైర్లు

AP: కోనసీమ దిష్టి వివాదం నేపథ్యంలో Dy.CM పవన్ కళ్యాణ్‌పై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. పొద్దున లేస్తే హైదరాబాద్‌లోనే ఉండే ఆయన తెలంగాణ ప్రజలను కించపరిచేలా మాట్లాడటం సరికాదని హితవు పలుకుతున్నారు. అప్పుడప్పుడు ఏపీకి వచ్చే ఆయన ఇటీవల కోనసీమలో వెకేషన్ కోసం పర్యటించారని సెటైర్లు వేస్తున్నారు. డిప్యూటీ సీఎం(DCM) అంటే దిష్టి చుక్క మంత్రి అంటూ ఎద్దేవా చేస్తున్నారు.


