News April 25, 2025
నేడు పహల్గామ్‌కు రాహుల్ గాంధీ

లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ నేడు జమ్మూకశ్మీర్‌కు వెళ్లనున్నారు. ఉగ్రదాడి జరిగిన పహల్గామ్ ప్రాంతాన్ని ఆయన పరిశీలించనున్నారు. ముష్కరుల దాడి సమయంలో అమెరికాలో ఉన్న రాహుల్ ఆ పర్యటనను అర్ధాంతరంగా రద్దు చేసి భారత్‌కు వచ్చారు. కాగా నిన్న జరిగిన అఖిల పక్ష సమావేశంలో ఉగ్రదాడి ఘటనపై ప్రభుత్వానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన సంగతి తెలిసిందే.
Similar News
News April 25, 2025
OTTలోకి వచ్చేసిన కొత్త చిత్రాలు

సంగీత్ శోభన్, నార్నె నితిన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘మ్యాడ్ స్క్వేర్’ ఓటీటీలోకి వచ్చేసింది. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. మార్చి 28న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం హిట్ అయిన విషయం తెలిసిందే. అలాగే బాలీవుడ్ స్టార్లు సైఫ్ అలీఖాన్, జైదీప్ అహ్లావత్ నటించిన ‘జ్యువెల్ థీఫ్’ మూవీ నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైంది.
News April 25, 2025
హిండెన్‌బర్గ్‌తో కలిసి పనిచేసిన రాహుల్ గాంధీ?

అదానీ గ్రూప్‌ను దెబ్బతీసేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హిండెన్‌బర్గ్ సంస్థతో కలిసి పనిచేశారని స్పుత్నిక్ ఇండియా నివేదిక తెలిపింది. ఆ విషయాన్ని ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్ కనిపెట్టిందని పేర్కొంది. ‘2023, మేలో హిండెన్‌బర్గ్‌కు సంబంధించిన వారితో కాలిఫోర్నియాలో రాహుల్ భేటీ అయ్యారు. రాహుల్‌కు సన్నిహితుడైన శామ్ పిట్రోడా ఈ-మెయిల్స్‌ను హ్యాక్ చేయడం ద్వారా మొసాద్ ఈ సంగతి గుర్తించింది’ అని తెలిపింది.
News April 25, 2025
మేధా పాట్కర్ అరెస్ట్

సామాజిక కార్యకర్త మేధాపాట్కర్‌ను పరువునష్టం కేసులో ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. 2000లో ‘నర్మదా బచావో’ ఆందోళనకు వ్యతిరేకంగా ప్రస్తుత LG VK సక్సేనా ప్రకటనలు ప్రచురించారని ఆరోపిస్తూ ఆయనపై పాట్కర్ కేసు వేశారు. అదే సమయంలో ఓ ఇంటర్వ్యూలో తన పరువుకు భంగం కలిగించేలా మాట్లాడారని ఆమెపై సక్సేనా సైతం పరువు నష్టం దావా వేశారు. సుదీర్ఘ విచారణ అనంతరం ఇటీవల ఆమెకు కోర్టు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.