News March 28, 2025
వచ్చే నెల 19నుంచి రాహుల్ గాంధీ అమెరికా పర్యటన

లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వచ్చే నెల 19న అమెరికాకు వెళ్లనున్నారు. బ్రౌన్ యూనివర్సిటీని సందర్శించిన అంతరం బోస్టన్లోని భారత సంతతి ప్రజలతో ఆయన మమేకమవుతారని తెలుస్తోంది. గత ఏడాది సెప్టెంబరులో ఆయన డల్లాస్, వాషింగ్టన్ డీసీలో పర్యటించారు. టెక్సాస్ వర్సిటీలో విద్యార్థులు, అధ్యాపకులతో ముచ్చటించారు.
Similar News
News December 3, 2025
ఈ విషయం మీకు తెలుసా?

చెప్పులు, బూట్లు కొనేటప్పుడు చాలా మంది పొడవు నంబర్ను మాత్రమే చూస్తారు. అయితే షూలకు పొడవుతో పాటు వెడల్పును సూచించే ప్రత్యేక నంబర్లు (ఉదాహరణకు, B,AA, EE) కూడా ఉంటాయి. ఇది తెలియక కొందరు కొత్తవి ఇరుకుగానే ఉంటాయని భావించి మౌనంగా నొప్పిని భరిస్తుంటారు. దీనివల్ల పాదాలు, అరికాళ్ల నొప్పులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇకనుంచి షూ కొనే సమయంలో Width, Length చూడాలంటున్నారు. దీనికోసం పైనున్న ఫొటో చూడండి.
News December 3, 2025
మీ బ్రెయిన్ ఏ గేర్ వేసింది..?

మన మెదడు 9, 32, 66, 83 వయస్సుల్లో లెవల్ షిఫ్ట్ అవుతుందని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు. 0-9yrs: పరిసరాలు తెలుసుకోవడం. 9-32: పరిపక్వత దిశగా ప్రయాణం, భావోద్వేగాలు, పనితీరు, ఆలోచన శక్తి పెరుగుతాయి. గ్రాఫ్ వేస్తే.. 32Yrs పీక్ పర్ఫార్మెన్స్. 32-66: సెటిల్డ్, లిమిటేషన్స్ మెంటాల్టి. ప్రిడిక్టబుల్ థాట్స్. 66-83: మతిమరుపు, అనారోగ్యం, రిజర్వ్డ్ అవుతారు. 83- కొన్ని పనులు, ఆలోచనలే చేయగలరు.
News December 3, 2025
ఇతిహాసాలు క్విజ్ – 85 సమాధానాలు

ఈరోజు ప్రశ్న: పాండురాజు మరణానికి గల కారణం ఏంటి?
సమాధానం: పాండురాజు వేటకు వెళ్లినప్పుడు, జింకలుగా భావించి కిందమ అనే మహామునిపై బాణం వేస్తాడు. దీంతో ఆ ముని మరణిస్తూ పాండురాజు తన భార్యతో కలిసిన తక్షణమే మరణిస్తాడని శపిస్తాడు. ఈ శాపం కారణంగా, ఒకరోజు మాద్రితో కలిసినప్పుడు పాండురాజు తక్షణమే మరణించారు. దాంతో మాద్రి సహగమనం చేసింది.
<<-se>>#Ithihasaluquiz<<>>


