News September 17, 2024

రాహుల్ గాంధీది జిన్నా మైండ్‌సెట్: పెట్రోలియం మంత్రి

image

దేశాన్ని విభజించి రక్తపాతం సృష్టించాలనుకుంటున్న రాహుల్ గాంధీకి జిన్నా తరహా మైండ్‌సెట్ ఉందని పెట్రోలియం మంత్రి హర్దీప్‌సింగ్ USలో విమర్శించారు. ‘భారత్‌లో రాహుల్ సిక్కుల గురించి మాట్లాడరు. ఎవరి హయాంలో, ఎందుకు వారిపై ఊచకోత జరిగిందో ఆయన అంతర్మథనం చేసుకోవాలి. కోరుకున్నది దక్కాలి లేదా నాశనమవ్వాలన్న జిన్నా వైఖరే ఆయనకుంది. ఓ పద్ధతి ప్రకారం ఆయన సిక్కులపై కుటిల యత్నానికి పాల్పడుతున్నారు’ అని అన్నారు.

Similar News

News October 22, 2025

సత్య నాదెళ్లకు రూ.846 కోట్ల జీతం

image

మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల జీతం భారీగా పెరిగింది. 2025 ఆర్థిక సంవత్సరానికి గాను ఆయన ప్యాకేజీ అంతకుమందు ఏడాదితో పోలిస్తే 22% అధికమైంది. ప్రస్తుతం ఆయన ఏడాదికి 96.5 మి.డాలర్ల (రూ.846 కోట్లు) జీతం అందుకుంటున్నారు. సత్య నాదెళ్ల, ఆయన లీడర్‌షిప్ టీమ్ వల్ల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో మైక్రోసాఫ్ట్ పురోగతి సాధించిందని కంపెనీ బోర్డు తెలిపింది. అలాగే షేర్ల ధరలు పెరిగాయని పేర్కొంది.

News October 22, 2025

వయసుతో నేర్చుకోవాల్సిన జీవిత సత్యాలు

image

* స్నేహితులు దూరమైనా నీతో నీకున్న బంధమే ముఖ్యం
* జనాలు నీ కష్టం కాకుండా ఫలితాలను మాత్రమే చూస్తారు
* వైఫల్యాలు జీవితంలో భాగమే
* ఇల్లు లాంటి మంచి చోటు మరొకటి లేదు
* జీవితంలో ముఖ్యమైనవి కుటుంబం, డబ్బు
* వ్యాయామం మనసుకు శాంతి, శరీరానికి బలం ఇస్తుంది
* పశ్చాత్తాపం, కన్నీళ్లు మీ సమయాన్ని వృథా చేస్తాయి
* అదృష్టం కాదు.. మీరు తీసుకునే నిర్ణయాలే మీ జీవితాన్ని డిసైడ్ చేస్తాయి. Share it

News October 22, 2025

కుంకుమపువ్వుతో మహిళలకు ఎన్నో లాభాలు

image

కుంకుమపువ్వుతో మహిళలకు ఎన్నో ప్రయోజనాలున్నాయంటున్నారు నిపుణులు. హార్మోన్ల సమతుల్యతను కాపాడటంతో పాటు బీపీ, కొలెస్ట్రాల్‌‌ను అదుపులో ఉంచి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడే క్రోసెటిన్, క్రోసిన్ కుంకుమపువ్వులో ఉంటాయంటున్నారు. రోగనిరోధకశక్తిని పెంచడంలో కూడా ఇది తోడ్పడుతుంది. పాలలో కలుపుకొని తాగటం లేదా కుంకుమ పువ్వు టీ చేసుకొని తాగడం మంచిదని సూచిస్తున్నారు.