News September 25, 2024
‘మేకిన్ ఇండియా’పై రాహుల్ గాంధీ చురకలు

మేకిన్ ఇండియా పేరుతో BJP అన్ని కాంట్రాక్టులను అదానీకి ఇస్తోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. JK ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ ఇజ్రాయెల్ తయారు చేసే ఆయుధాలకు, డ్రోన్లకు అదానీ స్టిక్కర్లు అంటించి దీన్నే మేకిన్ ఇండియా అంటున్నారని, ఇది ఎలా? అంటూ ప్రశ్నించారు. GST, నోట్లరద్దు వంటివి పాలసీలు కావని, అదానీ-అంబానీలకు వ్యాపార మార్గాలు సుగమం చేయడానికి వాడిన ఆయుధాలని రాహుల్ విమర్శించారు.
Similar News
News January 27, 2026
వీరు కాఫీ తాగితే ప్రమాదం

రోజూ తగినంత మోతాదులో కాఫీ తాగే వారిలో అల్జీమర్స్, టైప్-2 డయాబెటిస్, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ముప్పు తగ్గుతుంది. గర్భవతులు, బాలింతలు కాఫీకి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు నిపుణులు. ఒకవేళ తాగినా 200 మిల్లీ లీటర్లు తాగాలని సూచిస్తున్నారు. అలాగే మెటబాలిజమ్ స్లోగా ఉన్నవారు, యాంగ్జైటీ సమస్యలు ఉన్నవారు కాఫీకి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.
News January 27, 2026
మొక్కుబడులు చెల్లించకపోతే చెడు జరుగుతుందా?

మొక్కుబడులు చెల్లించకపోతే దేవుడికి కోపం వస్తుందని అంతా భయపడతారు. కానీ తల్లికి బిడ్డల మీద కోపం రానట్లే దేవుడు కూడా మొక్కులు తీర్చలేదని కష్టాలు పెట్టడు. ఆయన మన నుంచి కేవలం ధర్మబద్ధమైన జీవనాన్నే కోరుకుంటాడు. మనం చేసే కర్మానుసారమే సుఖదుఃఖాలు కలుగుతాయి. మొక్కులు మరచిపోవడం అనేది మన బలహీనత. దేవుడు ఎప్పుడూ సత్యం, మాట మీద నిలబడమని చెబుతాడు. ఆ నియమాన్ని మీరితే అది మన సమస్యే అవుతుంది.
News January 27, 2026
కేంద్ర బడ్జెట్ కేటాయింపులపై ఆశలు

AP: కేంద్ర బడ్జెట్పై రాష్ట్రం ఈసారి అనేక ఆశలు పెట్టుకుంది. అమరావతికి చట్టబద్ధత, పోలవరం పూర్తికి తగిన నిధులు అందించాలని ఇప్పటికే విన్నవించింది. రాజస్థాన్లో ₹40000CRతో నదుల అనుసంధానం చేపడుతున్నందున నల్లమలసాగర్కూ నిధులివ్వాలని కోరుతోంది. డేటా సెంటర్ వంటి సంస్థలతో ప్రాధాన్యం సంతరించుకున్న విశాఖ ఎకనమిక్ జోన్ అభివృద్ధికి ₹5వేల కోట్లు ఆశిస్తోంది. వివిధ మెగా ప్రాజెక్టులకూ నిధులపై ఆశాభావంతో ఉంది.


