News June 30, 2024
రాహుల్ జీ.. 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఎక్కడ?: కేటీఆర్

TG: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామన్న హామీ ఏమైందని రాహుల్ గాంధీని కేటీఆర్ ప్రశ్నించారు. ‘మీరు యువతను వ్యక్తిగతంగా కలిసి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. వార్తాపత్రికల్లో యాడ్‌లు ఇచ్చారు. 7 నెలలు దాటినా ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. మరి ఎలా 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తారు? ప్రభుత్వంలో ఎవరూ పట్టించుకోనందున మీరైనా స్పందించండి’ అని Xలో డిమాండ్ చేశారు.
Similar News
News November 28, 2025
కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు

‘దిత్వా’ తుఫాన్ ప్రభావంతో కోస్తా, రాయలసీమలో రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కురుస్తాయని APSDMA వెల్లడించింది. ‘నైరుతి బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న శ్రీలంక తీరంలో తుఫాన్ నెమ్మదిగా కదులుతోంది. గడచిన 6hrsలో 4kms వేగంతో కదులుతూ పుదుచ్చేరికి 420kms, చెన్నైకి 520kms దూరంలో కేంద్రీకృతమైంది. ఎల్లుండి నైరుతి బంగాళాఖాతం ఉత్తర TN, పుదుచ్చేరి, ద.కోస్తా తీరాలకు చేరుకునే అవకాశముంది’ అని ఓ ప్రకటనలో పేర్కొంది.
News November 28, 2025
DEC 13న HYDకు మెస్సీ: CM రేవంత్

TG: తన G.O.A.T. టూర్ లిస్టులో హైదరాబాద్ కూడా యాడ్ అయ్యిందని ఫుట్‌బాల్ లెజెండ్ మెస్సీ వెల్లడించిన విషయం తెలిసిందే. దీనిపై సీఎం రేవంత్ స్పందించారు. ‘డిసెంబర్ 13న హైదరాబాద్‌కి మెస్సీని స్వాగతించేందుకు ఎదురు చూస్తున్నాను. మా గడ్డ మీద మీలాంటి ఫుట్‌బాల్ స్టార్‌ని చూడాలని కలలుగన్న ప్రతి అభిమానికి ఇది ఎగ్జైటింగ్ మూమెంట్. మీకు ఆతిథ్యం ఇచ్చేందుకు హైదరాబాద్ సగర్వంగా సిద్ధమైంది’ అని ట్వీట్ చేశారు.
News November 28, 2025
భారత్ తగ్గేదే లే.. GDP వృద్ధి రేటు 8.2%

భారత జీడీపీ అంచనాలను మించి రాణించింది. 2025-26 ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్‌లో వృద్ధి రేటు 8.2%గా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరంలో ఇది 5.6%గా ఉంది. నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ ఈ నంబర్లను రిలీజ్ చేసింది. అమెరికా టారిఫ్స్ విధించినా భారత ఆర్థిక రంగం మెరుగ్గా రాణించడం విశేషం.


