News August 14, 2024
ED నూతన డైరెక్టర్‌గా రాహుల్ నవీన్

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నూతన డైరెక్టర్‌గా 1993 బ్యాచ్‌కు చెందిన IRS రాహుల్ నవీన్ నియమితులయ్యారు. ప్రస్తుతం EDలోనే స్పెషల్ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. సంజయ్ కుమార్ మిశ్రా పదవీకాలం పూర్తయిన సందర్భంగా ED ఇన్‌ఛార్జ్ డైరెక్టర్‌గా రాహుల్ నవీన్ గతేడాది సెప్టెంబర్‌లో బాధ్యతలు చేపట్టారు.
Similar News
News July 4, 2025
భోగాపురం ఎయిర్‌పోర్ట్ తాజా ఫొటోలు

AP: ఉత్తరాంధ్ర అభివృద్ధికి వరమైన అల్లూరి సీతారామరాజు(భోగాపురం, VZM) ఎయిర్‌పోర్టు నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. టెర్మినల్ భవనం, రన్‌వే, ATC టవర్ పనులు దాదాపు పూర్తి కావొచ్చాయి. నిత్యం 5,000 మంది కార్మికులు నిరంతరాయంగా పనిచేస్తున్న ఈ ప్రాజెక్టును జూన్ 2026 నాటికి అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. అటు దేశంలో ఎక్కడా లేని విధంగా 3.8కి.మీ పొడవైన ఈ రన్‌వేపై తాజాగా ట్రయల్ రన్ నిర్వహించారు.
News July 4, 2025
ఒక్క బిడ్డకు జన్మనిస్తే రూ.1.30 లక్షలు!

జనాభా సంక్షోభాన్ని అధిగమించేందుకు చైనా ఓ పథకం ప్రవేశపెట్టనుంది. ఒక్కో బిడ్డను కంటే ఏడాదికి 3,600 యువాన్లు (రూ.43 వేలు) రివార్డు ఇచ్చేందుకు సిద్ధమైంది. మూడేళ్లపాటు ఈ నగదు ప్రోత్సాహాన్ని కొనసాగించనుంది. ఇప్పటికే చైనాలోని మంగోలియా ప్రాంతంలో రెండో బిడ్డను కంటే రూ.6లక్షలు, మూడో బిడ్డను కంటే రూ.12 లక్షలు ఇస్తున్నారు. పెళ్లిళ్ల సంఖ్య తగ్గిపోవడం, ఫలితంగా జననాల రేటు పడిపోతుండటంతో ఈ చర్యలు తీసుకుంటోంది.
News July 4, 2025
KCR లేటెస్ట్ ఫొటోలు

TG: సాధారణ వైద్య పరీక్షల కోసం HYD యశోద ఆస్పత్రిలో చేరిన బీఆర్ఎస్ అధినేత KCRను పలువురు నేతలు పరామర్శించారు. <<16940361>>ఎలాంటి ఇబ్బంది లేకుండా<<>> కుర్చీలో కూర్చున్న మాజీ సీఎం.. కాసేపు నేతలతో మాట్లాడారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులు, రైతులకు యూరియా, ఎరువుల లభ్యత, వ్యవసాయం, సాగునీరు, ప్రజా సమస్యలపై వారితో చర్చించారు.