News April 6, 2024

హైదరాబాద్ చేరుకున్న రాహుల్

image

TG: తుక్కుగూడ జనజాతర సభ కోసం రాహుల్ గాంధీ హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర నేతలు ఆయనకు స్వాగతం పలికారు. మరోవైపు భారీగా కాంగ్రెస్ శ్రేణులు తుక్కుగూడకు చేరుకుంటున్నారు.

Similar News

News November 19, 2025

రాష్ట్రపతి అవార్డుకు ఎంపికైన ‘ఏటికొప్పాక’ బొమ్మ

image

ఏటికొప్పాక లక్కబొమ్మల కళాకారుడు గోర్స సంతోష్ కుమార్ రాష్ట్రపతి అవార్డుకు ఎంపికయ్యారు. మన సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా ఆయన తయారుచేసిన ‘బొమ్మల కొలువు’ బొమ్మకు మంచి గుర్తింపు లభించింది. దీంతో సంతోష్‌ను అవార్డుకు ఎంపిక చేశారు. వచ్చే నెల 9వ తేదీన న్యూఢిల్లీ విద్యా భవన్‌లో రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకోనున్నారు. సంతోష్‌ను పలువురు అభినందిచారు.

News November 19, 2025

స్టీల్ ప్లాంటుపై ప్రశ్నిస్తే అసహనం ఎందుకు: బొత్స

image

AP: విశాఖ స్టీల్ ప్లాంటుపై ప్రశ్నిస్తే చంద్రబాబు <<18299181>>సహనం<<>> కోల్పోతున్నారని YCP నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. బాధ్యత గల CM స్పందించాల్సిన విధానమిదేనా అని నిలదీశారు. డొంకతిరుగుడు సమాధానాలు మాని ప్రైవేటుపరం కానివ్వమని ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. CM వైఖరిపై అనుమానాలున్నాయన్నారు. అటు ప్రభుత్వ పెద్దలు, పోలీసు వ్యవస్థ తెచ్చిన ఒత్తిడితోనే పరకామణి కేసు ఫిర్యాదుదారు సతీశ్ చనిపోయి ఉంటాడని ఆరోపించారు.

News November 19, 2025

పిల్లలు లేని వృద్ధ దంపతులకు ఏ ఇల్లు అనుకూలం?

image

వృద్ధాప్యంలో భద్రత, చుట్టూ ఇతరులు ఉండే వాతావరణం ముఖ్యం. అలాంటివారికి చిన్న అపార్ట్‌మెంట్‌లు సౌకర్యంగా ఉంటాయని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. వారి అవసరాలు తీరేలా, వాస్తు ఆధారంగా నిర్మించిన చిన్న ఇల్లు/ప్లాట్ కొనడం ఉత్తమం అంటున్నారు. పైగా చిన్న ఇంటిని నిర్వహించడానికి వారికి సులభంగా ఉంటుంది. సామాజిక వాతావరణం ఒంటరితనాన్ని తగ్గిస్తుంది. పెద్ద వయసులో భద్రత ప్రధానం’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>