News March 18, 2024
రాహుల్ చెప్పింది నా గురించి కాదు: చవాన్

మహారాష్ట్రకు చెందిన సీనియర్ నేత బీజేపీలో చేరే ముందు తన తల్లి వద్దకు వచ్చి ఏడ్చారని రాహుల్ గాంధీ తాజాగా వ్యాఖ్యానించారు. అది ఆ రాష్ట్ర మాజీ సీఎం చవానేనంటూ వార్తలు వచ్చాయి. వాటిపై చవాన్ స్పందించారు. ‘ఆ మాటలు నా గురించే అయితే అవి నిరాధారం. నేను అసలు సోనియాతో మాట్లాడలేదు. నేను రాజీనామా చేసే వరకు విషయం ఎవరికీ తెలియదు. ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని ఆయన ఇలా మాట్లాడారు’ అని తెలిపారు.
Similar News
News July 7, 2025
వచ్చే ఏడాది ‘పంచాయత్’ ఐదో సీజన్

కామెడీ డ్రామా సిరీస్ ‘పంచాయత్’ ఐదో సీజన్ను అనౌన్స్ చేసింది. ఈ సీజన్ వచ్చే ఏడాది స్ట్రీమింగ్ కానున్నట్లు అమెజాన్ ప్రైమ్ వీడియో పోస్టర్ను రిలీజ్ చేసింది. హిందీ భాషలో రూపొందిన ఈ సిరీస్ నాలుగు పార్టులు ఇతర భాషల ప్రేక్షకులనూ మెప్పించాయి. జితేంద్ర కుమార్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ సిరీస్ను తెలుగులో ‘సివరపల్లి’ పేరిట రీమేక్ చేసి ఈ ఏడాది జనవరిలో తొలి సీజన్ను రిలీజ్ చేశారు.
News July 7, 2025
రేపు పలు జిల్లాల్లో వర్షాలు

AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేపు వర్షాలు పడతాయని APSDMA అంచనా వేసింది. గుంటూరు, నెల్లూరు, నంద్యాల జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే ఆస్కారం ఉందని చెప్పింది. మిగతా జిల్లాల్లో చిన్నపాటి జల్లులు పడేందుకు ఛాన్స్ ఉందని వివరించింది. ఇవాళ పలు జిల్లాల్లో వర్షం కురిసింది. మీ ప్రాంతంలో వాన పడిందా? కామెంట్ చేయండి.
News July 7, 2025
ఆర్కిటెక్చర్ విద్యార్థులను ఎందుకు పట్టించుకోవట్లేదు?: షర్మిల

AP: YSR ఆర్కిటెక్చర్ & ఆర్ట్స్ యూనివర్సిటీ విద్యార్థుల సమస్యను కూటమి ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని APCC చీఫ్ షర్మిల ప్రశ్నించారు. ‘కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అనుమతుల కోసం స్టూడెంట్స్ ఏడాదిగా పోరాటం చేస్తున్నారు. జగన్, అవినాశ్ అధికారంలో ఉన్నా పట్టించుకోలేదు. గత ప్రభుత్వ తప్పును సరిదిద్దాల్సిన బాధ్యత కూటమి సర్కార్కు లేదా? సర్టిఫికెట్లు లేకుంటే విద్యార్థుల జీవితాలేమవ్వాలి?’ అని మండిపడ్డారు.