News January 27, 2025
రంజీలకు సిద్ధమైన రాహుల్, సిరాజ్, పరాగ్

టీమ్ఇండియా స్టార్ ప్లేయర్లు రంజీ క్రికెట్ ఆడేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 30న హరియాణా మ్యాచ్కు అందుబాటులో ఉంటానని రాహుల్ కర్ణాటక జట్టుకు సమాచారమిచ్చారు. అటు హైదరాబాద్ తరఫున సిరాజ్, అస్సాం తరఫున రియాన్ పరాగ్ ఆడనున్నారు. మరోవైపు రైల్వేస్తో ఆడేందుకు ఢిల్లీ జట్టును ఇవాళ సెలక్టర్లు ప్రకటించనున్నారు. ఇప్పటికే రోహిత్, పంత్ తదితరులు రంజీ మ్యాచులు ఆడుతున్న విషయం తెలిసిందే.
Similar News
News November 18, 2025
రాష్ట్రస్థాయి రెజ్లింగ్ విజేతలు వీరే..!

రాష్ట్రస్థాయి సీనియర్స్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో జిల్లా రెజ్లింగ్ జట్టు పలు క్యాటగిరీలో పతకాలు సాధించింది. 87కేజీల బాలుర విభాగంలో వెంకటప్రసాద్ వెండి, 53 కేజీల బాలికల విభాగంలో సంధ్య వెండి, 50కేజీల బాలికల విభాగంలో మానస కాంస్య పతకాలు గెలుపొందారు. పతకాలు సాధించిన క్రీడాకారులను జిల్లా క్రీడా అధికారి పరంధామ రెడ్డి, జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు నాగ సీతారాములు అభినందించారు.
News November 18, 2025
ప్రతి కశ్మీరీ ముస్లింను అనుమానించొద్దు: ఒమర్ అబ్దుల్లా

ఢిల్లీ బాంబు బ్లాస్ట్ కేసులో వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్స్తో సంబంధమున్న అందరినీ కఠినంగా శిక్షించాలని J&K CM ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు. అదే సమయంలో అమాయక పౌరులను వేధించొద్దన్నారు. ప్రతి కశ్మీరీ ముస్లింని అనుమానించొద్దని నార్త్ జోన్ CMల సమావేశంలో కోరినట్లు చెప్పారు. పేలుళ్ల నేపథ్యంలో కశ్మీరీ పౌరులను టెర్రరిస్టు సింపథైజర్లుగా భావించరాదన్నారు. నౌగామ్ PS పేలుడు బాధితుల్ని ఆయన పరామర్శించారు.