News December 6, 2024
రాహుల్, సొరోస్ ఏక్ హై: BJP ఎదురుదాడి

ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై BJP ఎదురుదాడికి దిగింది. ఆయనను భారత వ్యతిరేకి జార్జి సొరోస్ చేతిలో కీలుబొమ్మగా వర్ణించింది. US డీప్‌స్టేట్‌తో ఆయనకు సంబంధాలు ఉన్నట్టు పేర్కొంది. ఈ కనెక్షన్లపై BJP4INDIA హ్యాండిల్లో సుదీర్ఘ ట్విటర్ థ్రెడ్స్ క్రియేట్ చేసి స్క్రీన్షాట్లను ఉంచింది. సొరోస్, ఓపెన్ సొసైటీ, OCCRP, డీప్ స్టేట్ ప్రతినిధులను రాహుల్ సీక్రెట్‌గా కలవడం, భారత్ జోడో యాత్రలో వారి హస్తంపై వివరించింది.
Similar News
News November 17, 2025
భారతీయ ఉద్యోగికి UAE అత్యుత్తమ బహుమతి!

UAE ఇచ్చే ‘అత్యుత్తమ ఉద్యోగి’ బహుమతిని ఇండియన్ గెలుచుకున్నారు. బుర్జీల్ హోల్డింగ్స్‌లో HR మేనేజర్‌గా అనాస్ కడియారకం(KL) పని చేస్తున్నారు. ఎమిరేట్స్ లేబర్ మార్కెట్ అవార్డ్స్‌లో అత్యుత్తమ వర్క్‌ఫోర్స్ కేటగిరీలో ఫస్ట్ ప్రైజ్ సాధించారు. ఆయనకు ట్రోఫీ, ₹24L, బంగారు నాణెం, యాపిల్ వాచ్, ఫజా ప్లాటినం కార్డు అందజేశారు. గతంలో కరోనా టైమ్‌లో సేవలకు హీరోస్ ఆఫ్ ది UAE మెడల్, గోల్డెన్ వీసాను అనాస్ అందుకున్నారు.
News November 17, 2025
అధిక పాలిచ్చే పశువుకు ఉండే లక్షణాలు(1/2)

పాడి ద్వారా ఎక్కువ ఆదాయం రావాలంటే మనం కొనే పశువు ప్రతి 14 నుంచి 15 నెలలకు ఒకసారి ఈనేట్లు ఉండాలి. పాడి పశువు పాలసార గురించి తెలుసుకోవాలంటే ఆ పశువు పొదుగును గమనించాలంటున్నారు వెటర్నరీ నిపుణులు. పొదుగు పెద్దదిగా ఉండి, శరీరంలో కలిసినట్లుగా ఉండాలి. అలాకాకుండా పొదుగు వేళ్లాడుతూ, జారిపోతున్నట్లుగా ఉండకూడదు. నాలుగు పాలసిరల (చనుమొనలు) అమరిక చతురస్రాకారంగా ఉండి, అన్నింటి నుంచి పాలు సులువుగా వస్తుండాలి.
News November 17, 2025
యక్ష ప్రశ్నలు, సమాధానాలు – 7

38. దేనిని నిగ్రహిస్తే సంతోషం కలుగుతుంది? (జ.మనస్సు)
39. ఎవరితో సంధి శిథిలమవదు? (జ.సజ్జనులతో)
40. ఎల్లప్పుడూ తృప్తిగా పడియుండునదేది? (జ.యాగకర్మ)
41. లోకానికి దిక్కు ఎవరు? (జ.సత్పురుషులు)
42. అన్నోదకాలు వేటి నుంచి ఉద్భవిస్తాయి? (జ.భూమి, ఆకాశములందు)
43.లోకాన్ని కప్పివున్నది ఏది? (జ.అజ్ఞానం)
44. శ్రాద్ధవిధికి సమయమేది? (జ.బ్రాహ్మణుడు వచ్చినప్పుడు) <<-se>>#YakshaPrashnalu<<>>


