News April 25, 2024

వెల్త్ సర్వేపై రాహుల్ యూటర్న్

image

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వెల్త్ సర్వే చేపడతామన్న వ్యాఖ్యలపై ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ యూటర్న్ తీసుకున్నారు. ‘మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పలేదు. ప్రజలకు ఎంత అన్యాయం జరిగిందనే విషయం తెలుసుకోవాలని అన్నాను. దీనికే దేశాన్ని ఖూనీ చేసేందుకు కుట్ర అంటూ ప్రధాని మోదీ, BJP ఆరోపిస్తున్నాయి’ అని తెలిపారు. కాగా ఈనెల 7న హైదరాబాద్‌లో పర్యటించిన సందర్భంగా అధికారంలోకి వస్తే వెల్త్ సర్వే చేస్తామని ప్రకటించారు.

Similar News

News January 21, 2026

ఉట్నూర్‌లో రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్

image

ఉట్నూర్ మండలం కుమ్మరి తాండలో 25 ఎకరాల విస్తీర్ణంలో రూ.200 కోట్ల వ్యయంతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌కు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. గిరిజన బిడ్డలు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యనభ్యసించి, దేశ భవిష్యత్తును నిర్మించే ఉత్తమ పౌరులుగా ఎదగాలన్నదే ప్రభుత్వ ఆకాంక్ష అని పేర్కొన్నారు. కార్యక్రమంలో కలెక్టర్, ఎస్పీ ఎమ్మెల్యేలు అధికారులు ఉన్నారు.

News January 21, 2026

రేపు జగన్ మీడియా సమావేశం

image

AP: YSRCP చీఫ్, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడతారని పార్టీ ప్రకటన విడుదల చేసింది. సమకాలీన అంశాలపై సమావేశంలో జగన్ ప్రసంగిస్తారని వివరించింది.

News January 21, 2026

నీటి నిష్క్రమణ ఏ దిశలో ఉండటం వాస్తు సమ్మతం?

image

ఇంటి వాడకం నీరు, వర్షపు నీరు ఈశాన్యం నుంచే వెళ్లాలని అంటారు. కానీ ఇది అన్ని దిశల ఇళ్లకు వర్తించదని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. ‘పడమర/ దక్షిణం వైపు రోడ్లు ఉన్న ఇళ్లకు ఈశాన్యం లోపలి వైపు ఉంటుంది. అలాంటివారు పడమర వాయువ్యం/దక్షిణ ఆగ్నేయం దిశల నుంచి నీటిని బయటకు పంపాలి. ప్రతి దిక్కుకు ఉండే శుభ ఫలితాలనిచ్చే మూలల ద్వారా నీరు వెళ్లడం వల్ల ఎటువంటి హాని జరగదు’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>