News August 1, 2024
రాహుల్ vs పంత్.. రోహిత్ శర్మ ఏమన్నారంటే?

శ్రీలంకతో రేపటి నుంచి జరిగే ODI సిరీస్‌లో WKగా ఎవరిని ఆడించాలనేది ఇంకా నిర్ణయించలేదని కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపారు. ‘కేఎల్ రాహుల్, పంత్ ఇద్దరూ క్వాలిటీ ప్లేయర్స్, మ్యాచ్ విన్నర్స్. టీమ్‌లో క్వాలిటీ ఉంది కాబట్టే సెలక్షన్ గురించి బయట చర్చ జరుగుతోంది. జట్టులో ఇలాంటి మంచి ప్లేయర్లు ఉన్నప్పుడు తుది జట్టు ఎంపిక కష్టంగా మారుతుంది. కానీ ఇలాంటి సమస్యలు ఉండటం మంచిదే’ అని ప్రెస్ కాన్ఫరెన్స్‌లో అన్నారు.
Similar News
News December 26, 2025
పేదల పక్షాన శతాబ్ది పోరాటం: ఎమ్మెల్సీ సత్యం

భూస్వామ్య, పెట్టుబడిదారీ వ్యవస్థలకు వ్యతిరేకంగా సీపీఐ సాగించిన పోరాటాలు అద్వితీయమని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం కొనియాడారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మగ్దూమ్ భవన్‌లో పతాకాన్ని ఆవిష్కరించారు. 1925లో కాన్పూర్‌లో ఆవిర్భవించిన నాటి నుంచి రైతు, కూలీ, అణగారిన వర్గాల హక్కుల కోసం సీపీఐ నిరంతరం పోరాడుతోందని, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతామని అన్నారు.
News December 26, 2025
చైనాతో సై అంటున్న భారత్!

చైనా ఎప్పటికైనా జిత్తులమారే అని గ్రహించిన భారత్.. సరిహద్దుల్లో మౌలిక వసతుల నిర్మాణాలను వేగవంతం చేస్తోందని అమెరికాకు చెందిన Wall Street Journal పేర్కొంది. 2020 బార్డర్ ఫైట్‌లో చైనా కొన్ని గంటల్లోనే ఆర్మీని తరలించగా ఇండియాకు వారం పట్టిందని తెలిపింది. దీంతో రోడ్లు, టన్నెల్స్, ఎయిర్ స్ట్రిప్స్ నిర్మాణాల కోసం Border Roads Organization బడ్జెట్‌ను $280 మిలియన్ల నుంచి $810 మి.కు పెంచిందని వివరించింది.
News December 26, 2025
దత్తాత్రేయునికి 3 తలలు, 6 చేతులు ఎందుకు?

బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ఏక స్వరూపమే దత్తాత్రేయుడు. అత్రి మహర్షి, అనసూయ దేవిల పుత్రుడైన దత్తుని 3 తలలు సృష్టి, స్థితి, లయకారక శక్తికి, ఆరు చేతులు సర్వదిక్కుల వ్యాప్తికి సంకేతాలు. ప్రకృతిలోని 24 అంశాలను గురువులుగా స్వీకరించిన ఈయన విశ్వగురువు. ఆయనను పూజించి అన్నదానం చేయడం వల్ల విశేష ఫలితాలుంటాయని నమ్మకం. దత్తాత్రేయుని ఆరాధిస్తే అటు గురువు, ఇటు దైవం ఇద్దరి అనుగ్రహం లభించి ఆత్మజ్ఞానం సిద్ధిస్తుంది.


