News March 6, 2025

రాహుల్‌ను స్పేర్ టైర్ కంటే దారుణంగా వాడారు: సిద్ధూ

image

భారత క్రికెటర్ KL రాహుల్‌పై మాజీ ప్లేయర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ ప్రశంసల వర్షం కురిపించారు. కెప్టెన్ ఏ స్థానంలో బ్యాటింగ్‌ చేయాలని కోరినా సిద్ధంగా ఉండే నిస్వార్థమైన ప్లేయర్ అన్నారు. T20ల్లో ఓపెనర్‌గా, BGTలో పేసర్లను ఎదుర్కొనేందుకు 3వ స్థానంలో, CTలో కీపింగ్‌తో పాటు 6వ స్థానంలో బ్యాటింగ్ చేస్తున్నట్లు తెలిపారు. ఇలా రాహుల్‌ను స్పేర్ టైర్‌ కంటే దారుణంగా వాడారని మేనేజ్‌మెంట్‌కు సెటైర్ వేశారు.

Similar News

News March 6, 2025

నాకౌట్ మ్యాచుల్లో కుల్దీప్ ఫెయిల్.. మరో బౌలర్‌ను తీసుకోవాల్సిందేనా?

image

టీమ్ ఇండియా ప్రధాన స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఐసీసీ నాకౌట్ మ్యాచుల్లో అంతగా రాణించట్లేదు. అతడి రికార్డులు 2023 వన్డే WC సెమీఫైనల్లో 1/56, ఫైనల్లో 0/56, 2024 టీ20 WC సెమీఫైనల్లో 3/19, ఫైనల్లో 0/45, CT-2025 సెమీఫైనల్లో 0/44గా ఉన్నాయి. ఆదివారం జరిగే ఫైనల్లో కుల్దీప్ స్థానంలో అర్ష్‌దీప్ లేదా హర్షిత్ రాణాను తీసుకోవాలని పలువురు విశ్లేషకులు సూచిస్తున్నారు. మీరేమంటారు?

News March 6, 2025

నుజ్జునుజ్జయిన మారుతి సుజుకీ కారు.. సేఫ్టీ ఎక్కడ?

image

హైదరాబాద్ ORRపై జరిగిన కారు ప్రమాదపు ఫొటోలు SMలో వైరలవుతున్నాయి. వాటర్ ట్యాంకర్‌ను వెనుక నుంచి ఢీకొట్టడంతో మారుతి సుజుకీ బ్రెజా కారు నుజ్జునుజ్జయి ఇద్దరు చనిపోయారు. ఈ మోడల్ కారు 5కు 4 Global NCAP rating సాధించినా ఇంతలా డ్యామేజ్ అవ్వడంపై నెటిజన్లు షాక్ అవుతున్నారు. మైలేజీ కోసం చూసుకుని ప్రజలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని, కంపెనీ సైతం వినియోగదారుల ప్రాణాలను లెక్కచేయట్లేదని విమర్శలొస్తున్నాయి.

News March 6, 2025

బాబర్ ఆజమ్‌‌పై విమర్శలు.. తండ్రి ఆగ్రహం

image

CTలో విఫలమైన పాక్ బ్యాటర్ బాబర్ ఆజమ్‌ను విమర్శించిన మాజీ క్రికెటర్లు, ఫ్యాన్స్‌పై ఆయన తండ్రి ఆజమ్ సిద్ధిఖీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘2024 ICC T20 టీమ్‌లో ఉన్న ప్లేయర్‌ను నేషనల్ T20 జట్టు నుంచి తొలగించారు. PSLలో రాణించి అతడు కమ్‌బ్యాక్ ఇస్తాడు. అతడిని విమర్శించే మాజీ క్రికెటర్లు జాగ్రత్తగా మాట్లాడాలని సూచిస్తున్నా. ఎవరైనా ఎదురు తిరిగి మాట్లాడితే మీరు తట్టుకోలేరు’ అని ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు.

error: Content is protected !!