News April 6, 2024
కాంగ్రెస్ను అంతం చేసే వరకు రాహుల్ విశ్రమించరు: రాజ్నాథ్

కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సెటైర్లు వేశారు. ‘క్రికెట్లో ధోనీ మాదిరి రాజకీయాల్లో రాహుల్ బెస్ట్ ఫినిషర్. ఆయన కాంగ్రెస్ను అంతం చేసే వరకు విశ్రమించబోరు. ఆయన వల్లే కీలక నేతలు ఆ పార్టీని వీడుతున్నారు. ఇప్పుడు రెండు, మూడు చిన్న రాష్ట్రాలకే INC పరిమితమైంది. హస్తం పార్టీకి, అవినీతికి విడదీయలేని బంధం ఉంది’ అని పేర్కొన్నారు.
Similar News
News December 27, 2025
ఇంట్లో ఎలాంటి విష్ణుమూర్తి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి?

ఇంట్లో విష్ణుమూర్తి విగ్రహాన్ని ప్రతిష్ఠించేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలని పండితులు సూచిస్తున్నారు. ‘విగ్రహాన్ని ఈశాన్యం, ఉత్తర లేదా తూర్పు దిశల్లో ఉంచాలి. లక్ష్మీదేవితో కలిసి ఉన్న విగ్రహం మరింత శుభప్రదం. విగ్రహం 6 అంగుళాల లోపు ఉండటం శ్రేయస్కరం. శేషశయనం కంటే నిలబడి/కూర్చున్న విగ్రహాలు నిత్య పూజకు మంచివి. విగ్రహాన్ని నేరుగా నేలపై కాకుండా పీఠంపై, మన ఛాతీ ఎత్తులో ఉండేలా చూసుకోవాలి’ అంటున్నారు.
News December 27, 2025
పెళ్లైన 24 గంటల్లోనే విడాకులకు అప్లై!

పుణేలో ఓ ప్రేమజంట విడాకులు నెట్టింట చర్చకు తెరలేపాయి. మ్యారేజ్ తర్వాత తాను మర్చంట్ నేవీలో డాక్టర్ అని భర్త చెప్పాడు. డ్యూటీకి వెళ్తే 6 నెలలు ఓడలోనే ఉండాల్సి వస్తుందని వివరించాడు. ఈ విషయం ముందే చెప్పాలి కదా అని భార్య నిలదీసింది. దీంతో వారు 24 గంటల్లోనే విడాకులకు అప్లై చేశారు. ఏ విషయమైనా పెళ్లికి ముందే చర్చించుకోవాలని, ఇలాంటివి అసలు దాచొద్దని నెటిజన్స్ అంటున్నారు.
News December 27, 2025
‘మేక్ ఇన్ ఇండియా’తో ఎలక్ట్రానిక్స్ రంగం పరుగులు: కేంద్రమంత్రి

ఎలక్ట్రానిక్స్ మానుఫ్యాక్చరింగ్ రంగం ‘మేక్ ఇన్ ఇండియా’తో పరుగులు పెడుతోందని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ‘2014-15మధ్య 2 మొబైల్ తయారీ యూనిట్స్ ఉంటే ఇప్పుడు 300కు పెరిగాయి. రూ.18వేల కోట్లుగా ఉండే మొబైల్ ఫోన్స్ ఉత్పత్తి రూ.5.5లక్షల కోట్లకు పెరిగింది. ఎలక్ట్రానిక్ గూడ్స్ ఉత్పత్తి రూ.1.9 లక్షల కోట్ల నుంచి రూ.11.3 లక్షల కోట్లకు, వాటి ఎగుమతి రూ.3.3లక్షల కోట్లకు పెరిగింది’ అని <


