News September 21, 2024

దేశాన్ని విడ‌దీయ‌డానికి రాహుల్ వెనుకాడ‌రు: క‌ంగ‌న‌

image

రాహుల్ గాంధీ అధికారం కోసం దేశాన్ని విడ‌దీయ‌డానికి వెనుకాడ‌బోర‌ని BJP MP కంగ‌నా ర‌నౌత్ విమ‌ర్శించారు. రాహుల్ విదేశాల్లో భార‌త్ గురించి ఎలాంటి విష‌యాలు మాట్లాడుతార‌న్న‌ది అంద‌రికీ తెలిసిన విష‌య‌మే అన్నారు. ‘కొంత మంది ప్రజల్ని వాడుకుంటున్నారు. కొన్ని వ‌ర్గాల్ని రెచ్చ‌గొడుతున్నారు. దేశంపై రాహుల్‌కు ఉన్న భావ‌న‌లు తెలిసిందే. అధికారం కోసం ఆయ‌న దేశాన్ని విడ‌దీయ‌డానికి వెనుకాడ‌రు’ అని కంగన విమ‌ర్శించారు.

Similar News

News September 21, 2024

20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యం: లోకేశ్

image

AP: గత వైసీపీ ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాలతో మన రాష్ట్రంతో పాటు దేశానికీ చెడ్డ పేరు వచ్చిందని మంత్రి లోకేశ్ విమర్శించారు. ప్రభుత్వాలు మారినా పాలన మారకూడదని చెప్పారు. YCP పాలనలో పారిశ్రామిక రంగం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొందన్నారు. ప్రభుత్వం, పారిశ్రామికవేత్తలకు మధ్య సంప్రదింపులకు ఒక ఫోరంను ఏర్పాటు చేస్తామని తెలిపారు. 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా కొత్త ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు.

News September 21, 2024

ఆ వివాదంలోకి కెనీషాను లాగొద్దు: జయం రవి

image

తమిళ నటుడు జయం రవి తన భార్యతో విడిపోవడం వెనుక గాయని కెనీషా ఫ్రాన్సిస్‌తో ఉన్న సంబంధమే కారణమని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై రవి తాజాగా స్పందించారు. ‘దయచేసి ఇందులోకి ఎవరి పేరునూ లాగొద్దు. వ్యక్తిగత జీవితాల్ని గౌరవించండి. చాలామంది చాలా అంటున్నారు. కెనీషా 600కు పైగా స్టేజీ షోల్లో పాడిన గాయని. కష్టపడి పైకొచ్చింది. ఆమెను ఈ వివాదంలో దయచేసి ఇన్వాల్వ్ చేయకండి’ అని విజ్ఞప్తి చేశారు.

News September 21, 2024

ఇగ్నో అడ్మిషన్ల గడువు పొడిగింపు

image

ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ (IGNOU) జులై 2024 సెషన్‌కు సంబంధించి అన్ని ఆన్‌లైన్, ఓపెన్ డిస్టెన్స్ లెర్నింగ్ (ODL) ప్రోగ్రామ్‌ల కోసం అడ్మిషన్ల గడువును పొడిగించింది. తాజాగా Sep 30, 2024 వ‌ర‌కు గ‌డువు పెంచింది. ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక పోర్టల్స్ ద్వారా అండర్ గ్రాడ్యుయేట్, పీజీ, డిప్లొమా, సర్టిఫికేట్ ప్రోగ్రామ్‌ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. గతంలో రెండుసార్లు అడ్మిషన్ల గడువు పెంచారు.