News March 17, 2024
ముగిసిన రాహుల్ ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’

ఏఐసీసీ అగ్ర నేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ ముంబైలో ముగిసింది. ఈ సందర్భంగా సెంట్రల్ ముంబైలోని బీఆర్ అంబేడ్కర్ చిహ్నం వద్ద రాహుల్ రాజ్యాంగ పీఠికను చదివారు. రేపు ఇండియా కూటమి ఆధ్వర్యంలో ముంబైలో భారీ బహిరంగ సభ జరగనుంది. కాగా 63 రోజుల పాటు 6700 కి.మీ మేర రాహుల్ యాత్ర చేపట్టారు. మొత్తం దేశంలోని 110 జిల్లాల్లో ఈ యాత్ర కొనసాగించారు.
Similar News
News August 25, 2025
సత్తా చాటిన విద్యార్థులకు సీఎం అభినందనలు

AP: రాష్ట్రంలోని సోషల్ వెల్ఫేర్ బడుల్లో చదివి ఈ ఏడాది IIT, నిట్, నీట్‌లో సీట్లు సాధించిన విద్యార్థులను CM చంద్రబాబు అభినందించారు. సీట్లు సాధించిన 55 మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఇవాళ సచివాలయంలో సీఎంను కలిశారు. పేదరికం నుంచి వచ్చి ఉత్తమ ప్రతిభ చూపిన వారికి సీఎం ఆల్ ది బెస్ట్ చెప్పారు. విద్యార్థులకు మెమెంటోలు, ఒక్కో విద్యార్థికి రూ.లక్ష చొప్పున చెక్ అందించి వారితో విడివిడిగా ఫొటోలు దిగారు.
News August 25, 2025
ఎల్లుండి నుంచి OTTలో ‘కింగ్డమ్’ స్ట్రీమింగ్

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన ‘కింగ్డమ్’ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. వినాయకచవితి కానుకగా ఈనెల 27నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుందని నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులో ఉంటుందని పేర్కొంది. థియేటర్లలో మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుని రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ అందించారు.
News August 25, 2025
పాక్‌కు అలర్ట్.. మానవత్వం చాటుకున్న భారత్

సింధు జలాల ఒప్పందం నిలిచిపోయినా వరదలపై పాకిస్థాన్‌ను హెచ్చరించి ఇండియా మానవత్వం చాటుకుందని PTI కొన్ని కథనాలను ఉటంకించింది. భారీ వర్షాలకు జమ్మూకశ్మీర్‌లోని తావి నది ఉప్పొంగొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీనిపై పాక్‌ను ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్ ద్వారా అలర్ట్ చేసినట్లు అక్కడి మీడియా కథనాలు ప్రచురించింది. మన అలర్ట్‌తో పాక్ యంత్రాంగం తమ ప్రజలను అప్రమత్తం చేసినట్లు తెలుస్తోంది.