News February 3, 2025
రాహుల్ వ్యాఖ్యలు అవాస్తవం: జయశంకర్

లోక్‌సభలో రాహుల్ చేసిన వ్యాఖ్యలు దేశ ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉన్నాయని విదేశాంగమంత్రి జయశంకర్ ఫైరయ్యారు. ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ప్రధానిని ఆహ్వానించామని కోరడానికి తాను అమెరికాకు వెళ్లాననడం పూర్తిగా అబద్ధం అన్నారు. విదేశాంగ కార్యదర్శిని కలవటానికే అక్కడికి వెళ్లానని స్పష్టం చేశారు. ఎంతో ప్రతిష్ఠ కలిగిన మోదీ లాంటి నాయకుడిపై ఇలాంటి చౌకబారు వ్యాఖ్యలు చేయటం సరికాదని తన X ఖాతాలో పోస్ట్ చేశారు.
Similar News
News November 15, 2025
ప్రెగ్నెన్సీకి సిద్ధంగా ఉన్నారా?

ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసినప్పటి నుంచే చాలా విషయాల్ని దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. గర్భం దాల్చడానికి ముందు మహిళలు తమ శరీరం అందుకు సహకరించేలా చూసుకోవాలి. ఎముకలు, కండరాల పటిష్టత, శరీరంలోని రక్తం పరిమాణం, శారీరక, మానసికబలంపై దృష్టి పెట్టాలి. వ్యాయామం, పోషకాహారం తప్పనిసరి. థైరాయిడ్, విటమిన్ D3, విటమిన్ B12, బ్లడ్ షుగర్ టెస్టులు కూడా చేయించుకోవాలి.
News November 15, 2025
ఈ పుట్టగొడుగులు.. కిలో రూ.30 వేలు

భారత్‌లో లభించే పుట్టగొడుగుల్లో ఖరీదైనవి ‘గుచ్చి’(మోరెల్) పుట్టగొడుగులు. ఇవి జమ్మూకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, అరుణాచల్‌ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తాయి. వీటిని తింటే రోగ నిరోధక శక్తి పెరిగి ప్రాణాంతక వ్యాధుల ముప్పు తగ్గుతుందట. ఔషధాల తయారీలో వీటిని వాడుతున్నారు. దేశీయంగా వీటి ధర KG రూ.30K-రూ.35 వేలు కాగా విదేశాల్లో KG రూ.40వేలు పైనే.✍️మరింత సమాచారానికి <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.
News November 15, 2025
బీజేపీ నెక్ట్స్ టార్గెట్ ఇదే..

బిహార్ జైత్రయాత్రను మిగతా రాష్ట్రాల్లోనూ కొనసాగించాలని బీజేపీ చూస్తోంది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళలో మార్కు చాటడంపై ఫోకస్ చేసింది. బెంగాల్ నెక్ట్స్ టార్గెట్ అని నిన్న మోదీ చేసిన ప్రకటన దీనికి ఊతమిస్తోంది. అటు తమిళనాడులోనూ పాగా వేసేందుకు శతవిధాలా ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఇక కేరళలో యూడీఎఫ్, ఎల్డీఎఫ్ పోరును త్రిముఖంగా మార్చే ప్రణాళికల్లో ఉంది.


