News August 15, 2025

ఈనెల 17 నుంచి బిహార్‌లో రాహుల్ యాత్ర

image

బిహార్‌లో ‘ఓట్ చోరీ’ అంటూ ECపై ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ‘ఓటర్ అధికార్ యాత్ర’ చేపట్టనున్నారు. పారదర్శక ఓటర్ల జాబితానే లక్ష్యంగా తమ యాత్ర కొనసాగుతుందని ఆయన తెలిపారు. ఈనెల 17న ప్రారంభంకానున్న ఈ కార్యక్రమం సెప్టెంబర్ 1న బిహార్ రాజధాని పట్నాలోని గాంధీ మైదానంలో జరిగే మహాసభతో ముగియనుంది. ‘ఓట్ చోరీ’ ఉద్యమాన్ని విస్తరించేందుకు కాంగ్రెస్ మరిన్ని ర్యాలీలు, సభలు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది.

Similar News

News August 15, 2025

నేడే ట్రంప్, పుతిన్ భేటీ.. ఏం జరగనుంది?

image

US, రష్యా అధ్యక్షులు ట్రంప్, పుతిన్‌ల కీలక భేటీకి రంగం సిద్ధమైంది. పుతిన్‌పై ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు జారీ చేసిన అరెస్ట్ వారెంట్ పనిచేయని ప్రాంతమైన అలాస్కా(US)లో ఇవాళ వారు భేటీ కానున్నారు. ఉక్రెయిన్‌తో యుద్ధం, US ఆంక్షలు, ట్రేడ్ తదితర అంశాలపై చర్చించనున్నారు. చర్చలు విఫలమైతే INDపై టారిఫ్స్ మరింత పెరగొచ్చని US <<17407178>>హెచ్చరించిన<<>> విషయం తెలిసిందే. దీంతో ఏం జరగనుందన్న ఉత్కంఠ భారతీయుల్లోనూ నెలకొంది.

News August 15, 2025

నారావారిపల్లెకు స్కోచ్ అవార్డు.. సీఎం అభినందనలు

image

AP: సీఎం చంద్రబాబు స్వగ్రామం తిరుపతి(D) నారావారిపల్లెకు పీఎం సూర్యఘర్ పథకం కింద స్కోచ్ అవార్డు లభించింది. పైలట్ ప్రాజెక్టుగా ఎ.రంగంపేట, కందులవారిపల్లి, చిన్నరామాపురం, నారావారిపల్లెలో తక్కువ టైంలో సోలార్ రూఫ్‌టాప్ పనులను పూర్తి చేశారు. దీంతో ‘స్వర్ణ నారావారిపల్లె’ కింద కేంద్రం గుర్తించింది. SEP 20న ఢిల్లీలో జిల్లా అధికారులు అవార్డు అందుకోనున్నారు. ఈ సందర్భంగా అధికారులను CM చంద్రబాబు అభినందించారు.

News August 15, 2025

అమల్లోకి రూ.3000 యాన్యువల్ పాస్

image

దేశ వ్యాప్తంగా ఇవాళ్టి నుంచి రూ.3,000 ఫాస్టాగ్ పాస్ అమల్లోకి వచ్చింది. నేషనల్ హైవేలు, ఎక్స్‌ప్రెస్ హైవేలపై కార్లు, జీపులు, వ్యాన్లు వంటి వాణిజ్యేతర వాహనాలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. ఈ పాస్ తీసుకుంటే ఫాస్టాగ్‌ను పదేపదే రీఛార్జ్ చేయించాల్సిన అవసరం లేదు. ఏడాదిలో 200 ట్రిప్పుల వరకు ఈ పాస్‌తో ఎలాంటి అదనపు చెల్లింపులు లేకుండా ప్రయాణం చేయవచ్చు. ఎలా అప్లై చేయాలో తెలుసుకోవడానికి <<17380892>>క్లిక్ <<>>చేయండి.