News September 22, 2025
రైల్‌నీర్ వాటర్ బాటిల్ @రూ.14

GST శ్లాబుల సవరణలతో ఇవాళ్టి నుంచి రైళ్లలో లభించే రైల్‌నీర్ వాటర్ బాటిల్ ధరను రైల్వే శాఖ తగ్గించింది. ఇప్పటివరకూ 1L బాటిల్‌పై రూ.15గా ఉన్న ధర రూ.14కు తగ్గింది. అలాగే గతంలో రూ.10గా ఉన్న 500 మి.లీ. బాటిల్ ₹9కే లభించనుంది. అయితే ఎక్కువ ధరలకు విక్రయిస్తే 139కు కాల్ చేసి ఫిర్యాదు చేయొచ్చు. ప్రతి రూపాయి ముఖ్యమే కాబట్టి తగ్గిన ధరలను గమనించి చిల్లరను అడిగి తీసుకోండి. SHARE IT
Similar News
News September 22, 2025
‘చిన్నారి పెళ్లి కూతురు’ నటి పెళ్లి డేట్ ఫిక్స్

నటి అవికా గోర్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ప్రియుడు మిలింద్ చంద్వానీని ఈనెల 30న పెళ్లి చేసుకోనున్నట్లు ఓ షోలో ఆమె ప్రకటించారు. 2020 నుంచి ప్రేమలో ఉన్న వీరిద్దరికీ ఈ ఏడాది జూన్‌లో నిశ్చితార్థం అయింది. ‘చిన్నారి పెళ్లి కూతురు’ సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులకు అవిక దగ్గరయ్యారు. ఆ తర్వాత టాలీవుడ్‌లో ‘రాజు గారి గది-3’, ‘ఉయ్యాల జంపాల’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ తదితర చిత్రాల్లో నటించారు.
News September 22, 2025
ఇంకా వంద రోజులే ఉంది మిత్రమా!

చాలామంది కొత్త ఏడాది ప్రారంభంలో కొన్ని గోల్స్ పెట్టుకుంటారు. కానీ అందులో కొందరు మాత్రమే వాటిని రీచ్ అవుతారు. మీరు పెట్టుకున్న గోల్స్, చేయాలనుకున్న పనిని పూర్తిచేసేందుకు ఇంకా కొంత సమయమే మిగిలి ఉంది. ఎందుకంటే ఇంకా వంద రోజుల్లో 2025 ముగియనుంది. ఈ కొంత సమయాన్నైనా సద్వినియోగం చేసుకొని, మీ లక్ష్యాలను నెరవేర్చుకోండి. ఇన్నిరోజులూ వాయిదా వేసిన పనులను పూర్తి చేయండి. ALL THE BEST
News September 22, 2025
విజయవాడ ఉత్సవ్‌కు అడ్డంకులు తొలగిపోయాయి: కేశినేని చిన్ని

AP: విజయవాడ ఉత్సవ్‌కు అడ్డంకులు తొలగిపోయాయని MP కేశినేని చిన్ని తెలిపారు. ‘ఎగ్జిబిషన్ ఏర్పాటుకు SC గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. SEP 24 నుంచి ఎగ్జిబిషన్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుంది. కృష్ణా నది వరద ఉద్ధృతి కారణంగా వాటర్ స్పోర్ట్స్ రద్దు చేశాం. ఉద్ధృతి తగ్గాక ఆ స్పోర్ట్స్ నిర్వహిస్తారు’ అని చెప్పారు. ఉత్సవ్‌లో భాగంగా గొల్లపూడి వద్ద ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను TDP నేతలు ఉదయం ప్రారంభించారు.