News January 29, 2025
మహాకుంభ్ రైళ్ల రద్దుపై రైల్వే మినిస్ట్రీ క్లారిటీ

మహాకుంభ్ స్పెషల్ ట్రైన్లను ఇండియన్ రైల్వే తాత్కాలికంగా నిలిపేసిందన్న వార్తలపై రైల్వే మినిస్ట్రీ క్లారిటీ ఇచ్చింది. ఇప్పటికైతే అలాంటి ప్లానేమీ లేదని తెలిపింది. మహా కుంభమేళా జరుగుతున్న ప్రయాగ్ రాజ్ ప్రాంతంలోని వేర్వేరు స్టేషన్ల నుంచి ఈ ఒక్కరోజే 360 రైళ్లను నడిపేందుకు ప్లాన్ చేస్తున్నామని వెల్లడించింది. మౌని అమావాస్య కావడంతో నేడు త్రివేణీ సంగమ స్థలి, వివిధ ఘాట్లు భక్తకోటితో నిండిపోవడం తెలిసిందే.
Similar News
News November 11, 2025
ఇంజినీర్ పోస్టులకు RITES నోటిఫికేషన్

రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్( <
News November 11, 2025
రూ.4 కోట్ల కారు కొన్న అర్ష్దీప్ సింగ్

టీమ్ ఇండియా స్టార్ బౌలర్ అర్ష్దీప్ సింగ్ ఖరీదైన కారును కొనుగోలు చేశారు. మెర్సిడెస్ AMG G63 వ్యాగన్ మోడల్తో ఫొటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ కారు 585 HP పవర్, 850 NM టార్క్తో 0-100 కి.మీ వేగాన్ని 4.3 సెకన్లలోనే అందుకుంటుంది. ధర దాదాపు రూ.4 కోట్లు.
News November 11, 2025
ఇంటి బేస్మెంట్ రోడ్డు కంటే ఎంత ఎత్తు ఉండాలి?

ఇంటి బేస్మెంట్ ఎత్తు గురించి వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు ముఖ్యమైన సలహాలిచ్చారు. ‘ఇంటి బేస్మెంట్ తప్పనిసరిగా రహదారి ఎత్తు కంటే కనీసం 3 ఫీట్ ఎత్తులో ఉండాలి. లేకపోతే వర్షాకాలంలో నీరు ఇంట్లోకి వస్తుంది. రహదారి నుంచి వచ్చే ప్రతికూల శక్తులు, కాలుష్యం నేరుగా ఇంట్లోకి రాకుండా నిరోధించడానికి ఈ నియమం పాటించాలి. ఇంటికి ఆధారం, గౌరవం పెరగడానికి, లోపల శుద్ధి ఉండడానికి ఈ ఎత్తు ఉత్తమం’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>


