News February 1, 2025
లాభాల్లో ట్రేడ్ అవుతున్న రైల్వే స్టాక్స్

బడ్జెట్ ముంగిట రైల్వే స్టాక్స్ ఊపందుకున్నాయి. భారీ కేటాయింపులుంటాయన్న అంచనాలతో దూసుకెళ్తున్నాయి. IRFC Ltd, RVNL Ltd, IRCON International Ltd, RailTel Ltd, IRCTC వంటి షేర్లు 4శాతానికిపైగా లాభపడ్డాయి. జుపిటర్ వాగన్స్ లిమిటెడ్ షేర్లు ఏకంగా 19.67 శాతం మేర, రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ 12.55శాతం, టిటాగర్ రైల్ సిస్టమ్ లిమిటెడ్ 13.27శాతం మేర లాభాల్ని చూస్తున్నాయి.
Similar News
News November 25, 2025
నల్గొండ: రైతు భరోసా కోసం రైతుల ఎదురుచూపులు

నల్గొండ జిల్లాలో యాసంగి పంట సాగుకు సిద్ధమవుతున్న 10.82 లక్షల మంది రైతులు రైతు భరోసా పథకం పెట్టుబడి సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. వానాకాలం, యాసంగి పంటలకు కలిపి ప్రభుత్వం ఏటా రూ.12,000 అందిస్తుంది. అయితే, ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో విడుదల కావాల్సిన ఈ యాసంగి సహాయం ఇప్పటివరకు రాకపోవడంతో రైతులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు.
News November 25, 2025
ఆకుకూరల సాగు- అనువైన నేలలు, వాతావరణం

తక్కువ సమయంలో రైతు చేతికొచ్చి, నిరంతరం ఆదాయం అందించే పంటల్లో ఆకుకూరలు ముందుంటాయి. ఆకుకూరలను మురుగు నీరు ఇంకిపోయే అన్ని రకాల నేలల్లో సాగు చేయవచ్చు. నేల ఉదజని సూచిక 6.0 నుంచి 7.5గా ఉండాలి. వానాకాలం, వేసవి కాలం, 16 నుంచి 35 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉన్న సమయం ఆకుకూరల పంటలు పెరగడానికి అత్యంత అనుకూలం. 15 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత ఉంటే తోటకూరను సాగు చేయడం కష్టం.
News November 25, 2025
మేము లడ్డూ క్వాలిటీ విషయంలో రాజీపడలేదు: సజ్జల

AP: వైసీపీని టార్గెట్ చేస్తూ తిరుమల లడ్డూ విచారణ జరుగుతోందని వైసీపీ నేత సజ్జల అన్నారు. ‘కల్తీ నెయ్యి విచారణ పారదర్శకంగా జరగడం లేదు. మేము లడ్డూ క్వాలిటీ విషయంలో రాజీపడలేదు. సీఎం చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. అప్పుడు ఇవే కంపెనీలు, ఇప్పుడూ ఇవే కంపెనీలు నెయ్యి సప్లై చేస్తున్నాయి.. నెయ్యి కల్తీకి ఎక్కడ అవకాశం ఉంది’ అని ప్రెస్ మీట్లో ప్రశ్నించారు.


