News April 4, 2024

రైల్వేకోడూరు జనసేన అభ్యర్థి మార్పు

image

AP: రైల్వేకోడూరు జనసేన అభ్యర్థిని పవన్ కళ్యాణ్ మార్చారు. రైల్వేకోడూరు నుంచి అరవ శ్రీధర్ బరిలో ఉంటారని ప్రకటించారు. యనమల భాస్కర్ రావు స్థానంలో శ్రీధర్‌కు టికెట్ ఇచ్చారు. సర్వేల్లో భాస్కర్ రావుకు సానుకూల ఫలితాలు రానందుకే ఆయనను మార్చినట్లు తెలుస్తోంది. అరవ శ్రీధర్ ప్రస్తుతం ముక్కావారిపల్లె సర్పంచ్‌గా ఉన్నారు. మూడు రోజుల క్రితమే ఆయన జనసేనలో చేరారు.

Similar News

News January 23, 2026

పీవీ సింధుపై సీఎంల ప్రశంసలు

image

ఇంటర్నేషనల్ కెరీర్‌లో 500 విజయాలు సాధించిన తొలి భారతీయురాలిగా ఘనత వహించిన స్టార్ షట్లర్ పీవీ సింధుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఆట పట్ల ఆమె అంకితభావం, పట్టుదలను రేవంత్ కొనియాడారు. సింధు ఘనత దేశానికి గర్వకారణమన్నారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

News January 23, 2026

రేపటి నుంచి రష్యా-ఉక్రెయిన్-అమెరికా కీలక చర్చలు

image

రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు దిశగా తొలి అడుగుగా UAEలో రేపటి నుంచి త్రైపాక్షిక సమావేశం జరగనుంది. జనవరి 23, 24 తేదీల్లో ఉక్రెయిన్, అమెరికా, రష్యా ప్రతినిధులు చర్చలు జరుపుతారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ దావోస్‌లో ప్రకటించారు. ఇది మొదటి త్రైపాక్షిక భేటీ కావడం విశేషం. US అధ్యక్షుడు ట్రంప్‌తో జరిగిన భేటీ అనంతరం ఈ ప్రకటన చేశారు. రష్యా కూడా రాజీకి సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు.

News January 22, 2026

ముగిసిన దావోస్ పర్యటన.. అమెరికాకు CM రేవంత్

image

TG: ‘తెలంగాణ రైజింగ్’ ప్రతినిధుల బృందం దావోస్ పర్యటన విజయవంతంగా ముగిసినట్లు ప్రభుత్వం తెలిపింది. 3 రోజుల WEFలో ఆశించిన లక్ష్యాన్ని సాధించినట్లు పేర్కొంది. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు, డేటా సెంటర్లు, క్లీన్ ఎనర్జీ రంగాల్లో పెట్టుబడులు వచ్చాయని, AI, సస్టైనబిలిటీ, స్కిల్లింగ్ అంశాలపై MoUలు కుదిరాయని వెల్లడించింది. మరోవైపు దావోస్‌లో కార్యక్రమాలు ముగించుకొని CM రేవంత్ <<18905782>>అమెరికా పర్యటన<<>>కు వెళ్తున్నారు.