News February 16, 2025
రైల్వే నిర్లక్ష్యం, ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనం: రాహుల్ గాంధీ

ఢిల్లీ రైల్వేస్టేషన్లో తొక్కిసలాట ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని రాహుల్ గాంధీ అన్నారు. రైల్వేశాఖ నిర్లక్ష్యం, ప్రభుత్వ అసమర్థతకు ఈ ఘటన అద్దం పడుతోందని ట్వీట్ చేశారు. మహా కుంభమేళాకు పెద్ద సంఖ్యలో భక్తులు వెళ్తున్నారని తెలిసి కూడా స్టేషన్లో ఎందుకు సౌకర్యాలు కల్పించలేదని ప్రశ్నించారు. ప్రజల ప్రాణాలు పోకుండా చూడాల్సిన బాధ్యత వ్యవస్థలపై ఉందన్నారు.
Similar News
News December 6, 2025
గ్లోబల్ డిఫెన్స్ మాన్యుఫాక్చర్ హబ్‌గా ఇండియా

రక్షణ ఉత్పత్తుల తయారీలో గ్లోబల్ హబ్‌గా భారత్ ముందడుగు వేస్తోంది. 2029లో ₹3Tల మేర ఉత్పత్తి చేయడంతో పాటు ₹50,000 కోట్ల విలువైన ఎగుమతులు చేయాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా ఇండియన్ ARMY, NAVY, AIRFORCEకు సంబంధించిన ₹670 Bల ప్రపోజల్‌ను డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఆమోదించింది. FY27లో రక్షణరంగ బడ్జెట్ 20% మేర పెరగవచ్చని ఇప్పటికే రక్షణ శాఖ సంకేతాలు పంపింది. దీంతో రక్షణ ఉత్పత్తులు ఊపందుకోనున్నాయి.
News December 6, 2025
టాస్ గెలిచిన భారత్

విశాఖలో సౌతాఫ్రికాతో జరిగే మూడో వన్డేలో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. 20 వన్డేల తర్వాత టీమ్ ఇండియా టాస్ గెలవడం విశేషం. సుందర్ స్థానంలో తిలక్ వర్మ జట్టులోకి వచ్చారు.
భారత్: జైస్వాల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్, కేఎల్ రాహుల్ (C), తిలక్ వర్మ, జడేజా, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ.
News December 6, 2025
4,116 పోస్టులు.. దరఖాస్తు చేశారా?

RRC నార్తర్న్ రైల్వేలో 4,116 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. టెన్త్, ఐటీఐ అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 24వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 24ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. దరఖాస్తు ఫీజు రూ.100. టెన్త్, ఐటీఐలో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: www.rrcnr.org


