News December 17, 2024
మళ్లీ వర్షం.. రెండో సెషన్ ఆలస్యం

బ్రిస్బేన్ టెస్టును వరుణుడు వదలట్లేదు. లంచ్ బ్రేక్ తర్వాత ఆట మొదలు కావాల్సి ఉండగా వర్షం మొదలైంది. దీంతో పిచ్ను కవర్లతో కప్పి ఉంచారు. మూడో టెస్టు తొలి రోజు నుంచి వర్షం మ్యాచ్కు ఆటంకం కలిగిస్తూనే ఉంది. ఇవాళ నాలుగో రోజు కాగా, భారత్ 278 రన్స్ వెనుకంజలో ఉంది. క్రీజులో జడేజా(41), నితీశ్ రెడ్డి (7) ఉన్నారు. వర్షం తీవ్రత పెరగడం వల్ల రెండో సెషన్ ఆట మరింత ఆలస్యం కానుంది.
Similar News
News December 9, 2025
పంచాయతీ ఎన్నికల్లో వారే అధికం!

TG: జీపీ ఎన్నికల్లో మహిళా ఓటర్లదే పైచేయిగా ఉంది. మొత్తం 1,66,48,496 మంది ఓటర్లు ఉన్నారని ఈసీ వెల్లడించగా అందులో 81,38,937 మంది పురుషులు, 85,09,059 మంది మహిళా ఓటర్లు ఉన్నట్లు పేర్కొంది. ఇతరుల సంఖ్య 500గా ఉంది. పురుషులతో పోలిస్తే మహిళా ఓటర్లు 3.50 లక్షలు అధికం. రాష్ట్రవ్యాప్తంగా మూడు విడతల్లో(11, 14, 17) పోలింగ్ కోసం 1,12,382 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు ఈసీ వెల్లడించింది.
News December 9, 2025
ఇంటి గుమ్మాన్ని ఎందుకు పూజించాలి?

గడపను ద్వార లక్ష్మిగా పూజిస్తే కుటుంబ శ్రేయస్సు కలుగుతుంది. ఇది దేవతలను ఆహ్వానించే ప్రదేశం కాబట్టి వారి అనుగ్రహం లభిస్తుంది. సిరిసంపదలతో పాటు, పెళ్లికాని వారికి మంచి భాగస్వామి దొరుకుతారు. ఇంట్లో ఉన్న కోర్టు సమస్యలు, ఆస్తి వివాదాలు తొలగిపోతాయి. సొంత ఇంటి కల నెరవేరాలంటే యజమాని ఈ ద్వారలక్ష్మి పూజ చేయాలని పండితులు సూచిస్తున్నారు. గడప పూజ కుటుంబానికి రక్షణ కవచంలా పనిచేస్తుందని అంటున్నారు.
News December 9, 2025
ఎంచివేస్తే, ఆరిక తరుగుతుందా?

కొందరు తమ దగ్గర ఉన్న సంపదను పదే పదే లెక్కబెడుతూ ఉంటారు. దాని గురించే ఆలోచిస్తూ ఉంటారు. నిరంతరం ఆ ధ్యాసలోనే బతుకుతారు. అయితే మన దగ్గర ఉన్న సంపద లేదా ధాన్యాన్ని ఎన్నిసార్లు లెక్కపెట్టినా అవి పెరిగిపోవు, తరగిపోవు. అవి మొదట ఎంత ఉన్నాయో, ఎన్నిసార్లు లెక్కించినా అంతే ఉంటాయి. వాటి గురించి పదే పదే ఆలోచన తగదు అని చెప్పే సందర్భంలో ఈ సామెత వాడతారు.


