News December 10, 2024

Rain Alert: కర్నూలులో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

image

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఈ నెల 11, 12 తేదీల్లో రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో కర్నూలు కలెక్టర్ రంజిత్ బాషా జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. కర్నూలు కలెక్టరేట్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. ప్రజలు అత్యవసర సమయాల్లో కంట్రోల్ రూమ్ నంబర్‌ 08518 277305కు ఫోన్ చేయాలని సూచించారు. 24 గంటలు అందుబాటులో ఉంటుందని తెలిపారు.

Similar News

News January 23, 2025

నంద్యాల రైల్వే స్టేషన్ వద్ద గుర్తు తెలియని వృద్ధుడు మృతి

image

నంద్యాల రైల్వే స్టేషన్‌లో గుర్తు తెలియని వృద్ధుడు మృతి చెందినట్లు నంద్యాల రైల్వే ఎస్సై అబ్దుల్ జలీల్ తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. ఫ్లాట్‌ఫామ్ నంబర్‌2 వద్ద వ్యక్తి మృతి చెందినట్లు చెప్పారు. మృతుడు కాషాయపు వస్త్రాలు ధరించాడని, సుమారు 60 ఏళ్లు ఉంటాయన్నారు. మృతి చెందిన వ్యక్తి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు. ఆచూకీ తెలిస్తే రైల్వే పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

News January 23, 2025

12వ రోజు 286 మంది అభ్యర్థుల ఎంపిక

image

ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి కానిస్టేబుల్ ఉద్యోగాల ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు కర్నూలు ఏపీఎస్పీ రెండో బెటాలియన్లో 12వ రోజు దేహదారుఢ్య పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు ఎస్పీ బిందుమాధవ్ తెలిపారు. 600 మంది అభ్యర్థులకు గాను 415 మంది అభ్యర్థులు హజరయ్యారన్నారు. ఫైనల్ పరీక్షకు 286 మంది అభ్యర్థులు అర్హత సాధించారని ఎస్పీ తెలిపారు.

News January 23, 2025

జాతీయ స్థాయి బీచ్ హ్యాండ్ బాల్ పోటీలకు ఆత్మకూరు క్రీడాకారులు

image

భారత ఒలింపిక్ సంఘం ఆధ్వర్యంలో ఈనెల 27 నుంచి 31 వరకు ఉత్తరాఖండ్లో జరగబోయే 38వ జాతీయ క్రీడలలో ఆంధ్రప్రదేశ్ బీచ్ హ్యాండ్ బాల్ పోటీలకు ఆత్మకూరుకు చెందిన క్రీడాకారులు శివకుమార్, రియాజ్ ఎంపికయ్యారు. ఈ మేరకు జిల్లా సంఘం కార్యదర్శి రుద్రారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా క్రీడాకారులను టీ&టీ అధినేత జబీర్ హుస్సేన్ ప్రత్యేకంగా అభినందించి నగదు ప్రోత్సాహాన్ని అందించారు.