News August 26, 2024
కావాలంటే నాపై మళ్లీ బుల్లెట్ల వర్షం కురిపించండి: ఒవైసీ

HYD బండ్లగూడలోని ఫాతిమా ఒవైసీ కాలేజీని ‘హైడ్రా’ కూల్చివేస్తుందన్న వార్తల నేపథ్యంలో MIM MLA అక్బరుద్దీన్ ఒవైసీ తీవ్రంగా స్పందించారు. ‘పేదలకు ఉచిత విద్యనందించేందుకు 12 బిల్డింగ్లు నిర్మించా. కొందరు వీటిపై వక్రదృష్టి పెట్టారు. గతంలో నాపై కాల్పులు జరిగాయి. కావాలంటే మళ్లీ బుల్లెట్ల వర్షం కురిపించండి. కత్తులతో దాడి చేయండి. కానీ పేదల విద్యాభివృద్ధి కృషికి అడ్డుపడకండి’ అని భావోద్వేగ ప్రసంగం చేశారు.
Similar News
News December 5, 2025
స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 124 పోస్టులు.. దరఖాస్తు గడువు పొడిగింపు

స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(<
News December 5, 2025
TG న్యూస్ రౌండప్

* కేంద్రం తీసుకొచ్చిన లేబర్ కోడ్స్పై అభిప్రాయాలు సేకరించేందుకు రేపు తెలంగాణ భవన్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నాం. దీనికి KTR హాజరవుతారు: బోయినపల్లి వినోద్
* కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఇన్ఛార్జ్ VCగా డా.రమేష్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది.
* HYD శామీర్పేటలో ఓ కారు టైర్లు, సీట్ల కింద ₹4Cr నగదును పోలీసులు గుర్తించారు. హవాలా ముఠాను అరెస్టు చేసి విచారిస్తున్నారు.
News December 5, 2025
గాంధీ చూపిన మార్గమే స్ఫూర్తి: పుతిన్

భారత్-రష్యా బలమైన బంధానికి గాంధీ చూపిన అహింసా మార్గమే స్ఫూర్తి అని రాజ్ఘాట్ సందర్శకుల పుస్తకంలో రష్యా ప్రెసిడెంట్ పుతిన్ రాసుకొచ్చారు. శాంతి, అభివృద్ధికి ఆయన చూపిన మార్గం భవిష్యత్తు తరాలను ఇన్స్పైర్ చేస్తూనే ఉంటుందన్నారు. జీవితాన్ని భారతదేశ స్వాతంత్ర్య పోరాటానికి అంకితం చేశారని, అహింసకు చిహ్నంగా మారారని రాశారు. ద్వైపాక్షిక వాణిజ్యం, దౌత్య సంబంధాలపై చర్చించడానికి పుతిన్ భారత పర్యటనకు వచ్చారు.


