News October 15, 2024
RAIN EFFECT: ఆ జిల్లాలో 3 రోజులు సెలవులు

AP: అల్పపీడన ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు. శ్రీసత్యసాయి జిల్లాలో నేటి నుంచి 17 వరకు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. చిత్తూరులో ఇవాళ, రేపు, అనంతపురంలో బుధ, గురువారాలు సెలవులు ఇస్తున్నట్లు ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రకటించారు.
Similar News
News November 18, 2025
మూవీ ముచ్చట్లు

*కల్ట్ క్లాసిక్ సినిమా ‘షోలే’ డిసెంబర్ 12న థియేటర్లలో రీరిలీజ్ కానుంది.
*మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థతో చేతులు కలిపిన దర్శకుడు ప్రశాంత్ నీల్. పూజా కార్యక్రమంతో హారర్ చిత్రం ప్రారంభం. సమర్పకుడిగా వ్యవహరించనున్న నీల్.
* ‘వారణాసి’ వీడియోకు అద్భుత స్పందన రావడంతో సాంకేతిక బృందానికి థాంక్స్ చెప్పిన రాజమౌళి. ప్రతి ఒక్కరి పేరు ప్రస్తావిస్తూ ట్వీట్.

చావడానికి సిద్ధంగా ఉన్నా: యువరాజ్ తండ్రి

తన జీవితం ముగిసిపోయిందని, చావడానికి సిద్ధంగా ఉన్నానని యువరాజ్ సింగ్ తండ్రి యోగ్రాజ్ సింగ్ అన్నారు. తన స్వగ్రామంలో ఒంటరిగా గడుపుతున్నానని, ఆహారం కోసం ఇతరులపై ఆధారపడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబాన్ని ప్రేమిస్తానని, ఎవరినీ సాయం అడగనని చెప్పారు. తాను కొన్ని తప్పులు చేసి ఉండొచ్చని, కానీ ఎవరికీ ఎలాంటి అపకారం చేయలేదని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. వృద్ధాప్యంలో ఎవరూ తోడుగా లేరని వాపోయారు.