News October 19, 2024

మరో 2 గంటల్లో వర్షం

image

తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న 2 గంటల్లో మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆ జిల్లాలు ఇవే..
కొత్తగూడెం, జగిత్యాల, జనగామ, గద్వాల, ఖమ్మం, మహబూబాబాద్, MBNR, నాగర్ కర్నూల్, నారాయణపేట్, నిజామాబాద్, సిరిసిల్ల, RR, సూర్యాపేట్, వికారాబాద్, వనపర్తి, వరంగల్, హన్మకొండ

Similar News

News October 19, 2024

సెంచరీ మిస్.. స్టేడియంలో హార్ట్ బ్రేకింగ్!

image

గాయంతో బాధపడుతూనే రిషభ్ పంత్ సూపర్ ఇన్నింగ్స్ ఆడారు. సెంచరీ చేస్తారని అంతా భావించగా 99 రన్స్ వద్ద ఔట్ అవడంతో స్టేడియమంతా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. మోకాలి నొప్పితోనే వీరోచితంగా ఆడి 9 ఫోర్లు, 5 సూపర్ సిక్సులతో పంత్ అదరగొట్టారు. పంత్‌కు సెంచరీ మిస్ అయినప్పటికీ ప్రేక్షకులు, ఆటగాళ్ల నుంచి స్టాండింగ్ ఒవేషన్ లభించింది. ఇది అభిమానులకు హార్ట్ బ్రేకింగ్ మూమెంట్ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

News October 19, 2024

రిజర్వేషన్లు రద్దు చేయాలని కాంగ్రెస్ కుట్ర చేస్తోంది: బండి సంజయ్

image

TG: గ్రూప్-1 పరీక్షను రీషెడ్యూల్ చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. గ్రూప్-1 అభ్యర్థులతో కలిసి ర్యాలీ చేస్తున్న ఆయన మీడియాతో మాట్లాడారు. ‘రాష్ట్రం మొత్తం అగ్గి రగులుతుంటే రాహుల్ గాంధీ ఎందుకు స్పందించడం లేదు. రాబోయే రోజుల్లో రిజర్వేషన్లు రద్దు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోంది’ అని అన్నారు. మరోవైపు ర్యాలీలో BJP, BRS కార్యకర్తల మధ్య తోపులాట జరగడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.

News October 19, 2024

‘మూసీ’కి డబ్బులుంటాయి కానీ రైతు భరోసాకు లేవా?: KTR

image

TG: రైతు భరోసా అమలు చేసే వరకూ కాంగ్రెస్‌ను వదిలేది లేదని KTR అన్నారు. ‘కాంగ్రెస్ గెలిస్తే రైతుబంధు ఇవ్వదన్న KCR మాటలను రేవంత్ సర్కార్ నిజం చేసింది. స్వయంగా వ్యవసాయశాఖ మంత్రే చేతులేస్తున్నట్లు ప్రకటించారు. డబ్బుల్లేక సబ్ కమిటీ అంటూ డ్రామాలు స్టార్ట్ చేశారు. మూసీ సుందరీకరణకు డబ్బులుంటాయి కానీ రైతు భరోసాకు లేవా?’ అని ప్రశ్నించారు. రేపు అన్ని మండలాల్లో ఆందోళనలు చేయాలని BRS శ్రేణులకు పిలుపునిచ్చారు.