News April 19, 2025

మరో గంటలో వర్షం

image

TG: పలు జిల్లాల్లో ఇవాళ కూడా వర్షాలు కొనసాగే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. మహా నగరంలో నిన్నటి తరహాలోనే సాయంత్రం వాన పడొచ్చని అంచనా వేసింది. అలాగే మెదక్, మేడ్చల్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో మరో గంటలో వర్షం కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. ఉదయం నుంచి ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఇది ఉపశమనం కలిగించే వార్తే అయినా అకాల వర్షాలతో జిల్లాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి.

Similar News

News January 24, 2026

‘సర్, ప్లీజ్ చేయి తీయండి’.. మౌనీ రాయ్‌కు చేదు అనుభవం

image

బాలీవుడ్ నటి మౌనీ రాయ్‌కు చేదు అనుభవం ఎదురైంది. హరియాణాలోని కర్నాల్‌లో జరిగిన ఓ వేడుకలో స్టేజ్‌ వైపు వెళ్తున్న సమయంలో ఫొటోలు తీసుకునే నెపంతో కొందరు ప్రేక్షకులు నడుముపై చేతులు వేసి అసభ్యంగా ప్రవర్తించారని ఆమె వెల్లడించారు. “సర్, ప్లీజ్ చేయి తీయండి” అని అడిగితే వారు మరింత దురుసుగా స్పందించారని తెలిపారు. స్టేజ్‌పైకి వెళ్లిన తర్వాత కూడా అసభ్య సైగలతో వేధించారని పేర్కొన్నారు.

News January 24, 2026

కేసీఆర్‌తో కేటీఆర్ భేటీ

image

TG: ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో మాజీ సీఎం కేసీఆర్‌తో కేటీఆర్ సమావేశం అయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిన్న విచారణకు హాజరైన విషయాలను గులాబీ బాస్‌కు వివరిస్తున్నట్లు తెలుస్తోంది. కాసేపట్లో హరీశ్ రావు కూడా ఫామ్‌హౌస్‌కు చేరుకోనున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు, త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలపై కేటీఆర్, హరీశ్‌కు కేసీఆర్ దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది.

News January 24, 2026

అమ్మాయితో అడ్డంగా దొరికిన పలాశ్.. ఫ్రూఫ్ ఏదని ప్రశ్న!

image

క్రికెటర్ స్మృతి మంధాన మాజీ లవర్ <<18940645>>పలాశ్‌<<>>పై వస్తున్న ఆరోపణలను అతని లాయర్ శ్రేయాన్ష్ కొట్టిపారేశారు. మరో అమ్మాయితో పలాశ్ అడ్డంగా దొరికిపోయాడన్న విద్యాన్ మానే ఆరోపణలను లాయర్ కొట్టిపారేస్తూ.. ‘దానికి సాక్ష్యం ఏది?’ అని ప్రశ్నించారు. అలాగే ₹40 లక్షల ఫ్రాడ్ ఆరోపణలపై స్పందిస్తూ ఆ డబ్బు చెక్కు ద్వారా ఇచ్చారా లేక ట్రాన్స్‌ఫర్ చేశారా అని నిలదీశారు. అతనికి లీగల్ నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు.